నేటి నుంచి పది పరీక్షలు


Sat,March 16, 2019 01:08 AM

రామగిరి: పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విభాగంలో 20,944 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరి కోసం 96 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 10,496 మంది బాలురు, 10,080 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత సమ యం తర్వాత (ఉదయం 9.35)5 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక తాగునీటి వసతితోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పరీక్షలలో ఎలాంటి మాస్ కాపియింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చర్యలుంటాయని డీఈఓ సరోజినిదేవి హెచ్చరించారు. ఫిర్యాదులను స్వీకరించడానికి డీఈఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను 08682-244208కు తెలుపాలని సూచించారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ సరోజినీదేవి
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను డీఈఓ సరోజినిదేవి శుక్రవారం నల్లగొండలోని డైట్ పాఠశాలలో పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, నెంబరింగ్ వేసే విధానం ఇతర వివరాలను ఆ పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఆమె వెంట సీసీ రాజ్‌కుమార్‌తోపాటు అధికారులు ఉన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...