ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలి


Sat,March 16, 2019 01:08 AM

నల్లగొండ కల్చలర్: టెన్త్ విద్యార్థులు ప్రశాంతంగా ఎలాం టి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను రాయాలని అందుకు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని డీఈఓ సరోజనీదేవి తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమ య్యే పదోతరగతి పరీక్షలను పురస్కరించుకుని శుక్రవా రం రాత్రి ట్రస్మా ఆధ్వర్యంలో నల్లగొండలోని వీటీకాలనీ సెంటర్‌లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయలో పదోతరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలాలు(గ్రేడింగ్స్) సాధించాలని సర్వసిద్ధికర పూజ నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజ లు చేసి మాట్లాడారు. స్వయంకృషితోపాటు క్షేత్రపాలకుడు, అదేవిధంగా సరస్వతి అమ్మవారి కృపకటాక్షాలుతోడై అందరూ విద్యార్థులు విజయవం సాధించిలని ఆకాక్షించా రు. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా అన్ని పరీక్షల కేంద్రాల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని విద్యార్థులు ఆత్మసైర్థ్యంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి రాష్ట్రంలో జిల్లా ను ఫలితాల్లో ప్రథమస్థానంలో ఉంచాలని కోరారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉజ్వ ల భవిష్యత్తు పొంది రాష్ర్టానికి పేరుతేవాలని కోరారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పది పబ్లిక్ పరీక్షలకు ముందు విద్యార్థులకు మనోదైర్ధ్యం, విజయం కలగాని కోరుతూ ఆంజనేయస్వామికి, సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవే ట్ అనే భేదాభిప్రాయాలను చూపించవద్దని కోరారు. అం తేకాకుండా వేసవి దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.

అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్‌ను అందచేశారు. కార్యక్రమం లో విద్యార్థులతోపాటు స్థ్ధానిక వార్డు కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి పున్న రవీందర్, నోడల్ అధికారి అంజిరెడ్డి, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట్ల అనంతరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెస్సిడెం ట్ ముక్కంల నర్సింహయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి శరంశెట్టి శ్రీధర్, కోడి శ్రీనివాస్, పట్టణాకార్యదర్శి బం గారు భాస్కర్, గెజిటెడ్ హెచ్‌ఎం అసోసియేషన్ డివిజన్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, న్యూస్, మమత పాఠశాలల హెచ్‌ఎంలు అల్గుబెల్లి తిరుమల్‌రెడ్డి, అల్గుబెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పర్వత్‌రెడ్డి, మల్లారెడ్డి, యోగాటైనర్ జినుగు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...