సెక్యులర్ ప్రభుత్వ నిర్మాణ దిశగా వామపక్షాలు


Sat,March 16, 2019 01:07 AM

నీలగిరి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వ నిర్మాణ దిశగా వామపక్షాలు కృషి చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు అంశాలతో వామపక్షాలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తున్నాయని తెలిపారు. మిగతా చోట్ల బీఎల్‌ఎఫ్ భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తాయన్నారు. పోటీ చేయని చోట సెక్యులర్ పార్టీలకు మద్దతునిస్తామని తెలిపారు. దీంతో పాటు కోదండరామ్, పవన్‌కల్యాణ్‌లతో చర్చలు త్వరలో కొలికి రానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు అనంతరామశర్మ, తుమ్మల వీరారెడ్డి, మామిడి సర్వయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, కందాల ప్రమీల, కున్‌రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...