బైక్ అదుపుతప్పి మామ మృతి


Sat,March 16, 2019 01:07 AM

మాల్ : బైక్ అదుపుతప్పి మామ మృతిచెందగా అల్లుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చింతపల్లి మండలం చాకలిశేరిపల్లి గ్రామశివారులో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్నగోని జంగయ్య(55) కూలీ పనులు చేస్తూ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని హస్తినాపూర్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై స్వగ్రామానికి వచ్చి అక్కడి నుంచి తన మేనల్లుడు తాట జంగయ్య(17)తో కలిసి చాకలిశేరిపల్లిలోని బంధువుల ఇంటి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గ్రామశివారులో బైక్ అదుపు తప్పడంతో జంగయ్య తలకు బలమైన గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందా డు. బైక్ నడుపుతున్న అల్లుడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108వాహనంలో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడు లక్కగోని జంగయ్యకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. జంగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...