దేశం యావత్తు కేసీఆర్ మార్క్‌పాలన కోరుతోంది


Fri,March 15, 2019 02:13 AM

- రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలుస్తాం
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత కీలకశక్తిగా టీఆర్‌ఎస్
- కేటీఆర్ సభకు 25వేల మంది కార్యకర్తలు
- విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
దేశం యావత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ మార్క్ పాలనను కోరుతోంది.. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించి ఢిల్లీలో కీలక శక్తిగా మారనుందని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. రేపు జిల్లాకేంద్రంలో జరుగనున్న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నందున.. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్, ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సభకు 25 వేల మంది పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు.
నీలగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మార్క్ ను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఈనెల 16న నల్లగొండ పార్లమెంటరీ సన్నాహాక సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తల్లో, క్యాడర్‌లో జోష్‌నింపేందుకు వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారన్నారు. 25వేల మంది పార్టీ ప్రజాప్రతినిధులు, అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని, దీన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీదే గెలుపు అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలిచి ఢిల్లీ లో క్రియాశీలకంగా మారుతుందన్నారు. టీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలతో యువతలో, పార్టీ కేడర్‌లో మరింత జోష్ పెరుగుతుందని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే రెం డింతల మె జార్టీ సా ధించే దిశ గా కార్యకర్తలను సైనికుల వలే తయారు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. రాష్ర్టానికి రాజ్యాంగ బద్దంగా రావల్సిన నిధులను ఇవ్వడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి కూడా అధికారాన్ని చేపట్టేంత మెజా ర్టీ వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, కేసీఆర్ అభివృద్ధి నమూనాను ఇతర రాష్ర్టాల ప్రజ లు కూడా కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో కేసీఆర్ ముందుండి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో ఉం చారన్నారు. కేటీఆర్ కేసీఆర్ తనయుడిలా గాకుండా ఒక మంచి నాయకుడిగా తనకు ఏ పదవి ఇచ్చినా వాటికి వన్నె తేవడంతో వంద దేశాల్లో తనకున్న పరిచయాలతో పారిశ్రామికవేత్తలను పిలిపించి పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సన్నాహాక సభను జయప్రదం చే యాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాషా, నల్లగొండ ఎంపీపీ దైద రజిత, టీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్‌వలీ, సుంకరి మల్లేష్‌గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, మందడి సైదిరెడ్డి, అబ్బగోని రమేష్, బక రం వెంకన్న, పిల్లిరామరాజు, ఆలకుంట్ల నాగరత్నంరా జు, చిలుకల గోవర్ధన్, జిల్లా శంకర్, పెద్దగోని వెంకన్న, మైనం శ్రీనివాస్, వంగాల సహదేవరెడ్డి, పున్న గణేష్, లొడంగి గోవర్ధన్, కంబాలపల్లి కృష్ణ పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...