ముగిసిన పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు


Fri,March 15, 2019 02:12 AM

నల్లగొండక్రైం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ప్రారంభమైన పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు గురువారం ముగిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈవెంట్స్ నిర్వహించారు. ప్రతి రోజు సుమారు 1000 మంది అభ్యర్థుల చొ ప్పున దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కాగా, బయోమెట్రిక్ ద్వారా వారి పేర్లు న మోదు చేయడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన అనంతరం దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులను అనుమతించారు. పరీక్షలను జిల్లా ఎస్పీ రంగనాథ్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోహెస్ డేవిల్, మెదక్ ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షించగా నోడల్ అధికారిగా ఏఎస్పీ పద్మనాభరెడ్డి పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ముగిసేవరకు సమర్ధవంతంగా నిర్వహించారు. పరీక్షలకు 24,908 మంది అభ్యర్థులు హాజరుకావల్సి ఉండగా 22,250మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20,862 మంది పురుష అభ్యర్థులతో పాటు గిరిజన ప్రాంతాలకు చెందిన వారు, మాజీ సైనికులు, దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 18,525 మంది ఈవెంట్స్‌కు హాజరు కాగా 10 వేల మంది అర్హత పొందారు. మహిళా అభ్యర్థులు 4046 మంది మహిళలు ఈవెంట్స్‌కు హాజరు కావల్సి ఉండగా 3728 మంది హాజరయ్యారు. వారిలో 1844 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షల్లో అర్హత సాధించినట్లు అధికారులు వివరించారు. గత నెల 11న ప్రారంభమై, ఈనెల 14న ముగిసిన దేహదారుఢ్య పరీక్షల్లో డీఎస్పీలు గంగారాం, సురేష్‌కుమార్, రమేష్‌తో పాటు ఆర్‌ఐ వైవీ. ప్రతాప్, శంకర్, సర్పజన్‌రాజు, నర్సింహాచారితో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారులు, సూర్యాపేట, మెదక్ బెటాలియన్ పోలీస్ అధికారులు విధులు నిర్వహించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...