సరిహద్దుల్లో పోలీస్ నిఘా


Sat,February 23, 2019 02:17 AM

- అక్రమ దందాలపై డేగకన్ను
- తెలంగాణ, ఆంధ్రా పోలీసుల సంయుక్త పర్యవేక్షణ
- వాడపల్లిలో నల్లగొండ, గుంటూరు జిల్లాల ఎస్పీల సమావేశం
దామరచర్ల : తెలంగాణ-ఆంధ్రా రాష్ర్టాల సరిహద్దుల్లో పోలీస్ నిఘా ఏర్పాటు చేయనున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలతోపాటుగా ఆంధ్రా లో జరిగే ఆసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం దామరచర్ల మండలంలోని వాడపల్లిలో గల ఇండి యా సిమెంట్ కర్మాగారంలో నల్లగొండ, గుంటూరు జిల్లాల ఎస్పీలు రంగనాథ్, రాజశేఖర్‌బాబు సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెండు జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సరిహద్దుల్లో నిఘాపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పరస్పర సహకారంతో ప్రణాళికలు తయారు చేసేందుకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు జిల్లాల పోలీసుల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రెండు రాష్ర్టాల సరిహద్దులైన వాడపల్లి, టేల్‌పాండ్, నాగార్జునసాగర్, సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, కోదాడ, పాలకవీడులోని సరిహద్దుల వద్ద పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా మద్యం, డబ్బు, పల్నాడు నుంచి బాంబుల సరఫరా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల అనంతరం కూడా క్యాంపులు కొనసాగిస్తామన్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం, సబ్సిడీ గొర్రెల అక్రమ రవాణా తదితర వాటిపై నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంయుక్తంగా నాన్ బెయిల్‌బుల్, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. గురజాల డీఎస్పీ కలేష్‌వలీ, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. సరిహద్దులే కాకుండా నదిపై ప్రయాణించే పడవలు, కాలిబాటలు, పుట్టీలపై కూడా నిఘా పెడుతున్నామన్నారు. సమావేశంలో సూర్యాపేట అడిషన్ ఎస్పీ పూజిత, నాగర్‌కర్నూల్, దేవరకొండ డీఎస్పీలు, మిర్యాలగూడ సీఐ రమేష్‌బాబుతోపాటుగా పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...