ఆసరాతో సర్కార్‌పై అదనపు భారం


Sat,February 23, 2019 02:12 AM

- ఏప్రిల్ నుంచి అమలు కానున్న పెరిగిన ఆసరా పింఛన్
-దివ్యాంగులకు రూ. 3016, ఇతరులకు రూ. 2016
-57 ఏళ్ల పైబడిన వారిలో మరో 19 వేల మంది
-ఇక నెల వారీగా రూ. 45 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ శుక్రవారం రూ. 1.82 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన ఓటాన్ బడ్జెట్‌లో ఆసరాకు మరింత ప్రాధాన్యత నిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆసరా కోసం రూ. 12,067 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఆసరా పథకం ద్వారా దివ్యాంగులు రూ. 1500 పొందుతుండగా ఇతర సామాజిక వర్గ పింఛనుదారులు రూ. వేయి అందుకుంటున్నారు. మొత్తంగా ప్రతి నెల జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 22.69 కోట్లు పింఛన్ల రూపంలో అందజేస్తుంది. వచ్చే ఆర్థ్ధిక సంవత్సరం నుంచి దివ్యాంగులకు రూ. 3016 పెంచగా ఇతర పింఛనుదారులకు రూ. 2016లు ఇవ్వనున్నారు. అంతేగాక పింఛన్ అర్హత వయస్సు 57 ఏళ్లకు కుదించడంతో మరో 19 వేల మంది అర్హత పొందనున్నారు. ప్రస్తుతం 1,91,351 మంది పింఛనుదారులు ఉండగా అందులో వృద్ధులు 66,664 మంది(మరో 19 వేలు పెరగనున్నారు) దివ్యాంగులు 30,455 మంది, వితంతువులు 76,378 మంది, చేనేత 2942, గీత 7648, ఒంటరి మహిళలు 72648 మంది ఉన్నారు. వీరికి వచ్చే ఏప్రిల్ నుంచి రూ. 45 కోట్లు వెచ్చించ నున్నారు. గతంతో పోలిస్తే ఒక్క నల్లగొండకే ప్రతి నెల ఆసరా పింఛన్ల కోసం రూ.22.50 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంది.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...