27నుంచి ఇంటర్ పరీక్షలు


Fri,February 22, 2019 12:33 AM

రామగిరి: జిల్లావ్యాప్తంగా 119 ఇంటర్ మీడియట్ కళాశాలలు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు. అదేవిధంగా మరో 8 మంది కస్టోడియన్స్, 2 ఫ్లయింగ్, ప్రతి పరీక్ష కేంద్రానికి సిట్టిం గ్ స్క్యాడ్ బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. వీరితో పాటు డీఐఈఓ, జిల్లా పరీక్షల విభాగం అధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు ప్రత్యేక నిఘాను సైతం చేస్తున్నామన్నారు.

హాజరు కానున్న 36,362 మంది విద్యార్థులు
ఇంటర్‌మీడియట్ పరీక్షలకు జిల్లా నుంచి 36,362 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథ మ సంవత్సరంలో 16,823 మంది విద్యార్థులు, ద్వితీ య సంవత్సరంలో 19,539 మంది విద్యార్థులు ఉన్నా రు. అయితే వీరితోపాటు ఒకేషనల్ విద్యార్థులు సైతం పరీక్షలకు హాజరవుతారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..
ప్రతిరోజు పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే నిర్ణీత సమయానికంటే ఒక నిమి షం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులంతా ఆయా పరీక్ష కేం ద్రాలకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఒక పర్యాయం పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి పరీక్ష ముగిసే వరకు బయటకు అనుమతించరు. పరీక్ష హాలులోకి పరీక్ష ప్యాడ్, హాల్‌టికెట్ , పెన్నులు తప్ప ఇతర ఏ వస్తువులను అనుమతించరు.

పరీక్ష కేంద్రాలు ఇలా...
జిల్లాలో జరిగే ఇంటర్ పరీక్షల కోసం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పటు చేశారు. (12 ప్రభుత్వ కళాశాలలు, ఒక ఎయిడెడ్, రెండు మోడల్ స్కూల్స్, రెండు రెసిడెన్షియల్ కళాశాలలు, 29 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి) నల్లగొండలో 19, నకిరేకల్‌లో 4, కట్టంగూర్‌లో 1, మిర్యాలగూడలో 8, చండూరులో 1, మర్రిగూడలో 3, కొండమల్లేపల్లిలో 1, దామరచర్లలో 1, దేవరకొండలో 3, సాగర్‌లో 1, హాలియాలో 1, చింతపల్లిలో 1, నాంపల్లిలో 1, డిండిలో 1 చొప్పున ఉన్నాయి.

జీపీఎస్‌తో ప్రత్యేక నిఘా...
అక్రమాలకు, మాస్‌కాపియింగ్‌కు చెక్ పెట్టేలా ఈ పర్యా యం ఇంటర్‌మీడియట్ పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. పరీక్ష జరిగే సమయంతో పాటు పేపర్స్‌ను ప్యాకింగ్ చేసే వరకు ఆ కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవ్వరూ కూడా సెల్‌పోన్లను ఉపయోగించరాదు. అయితే ఎవరైనా సెల్‌పోన్లను ఉపయోగించిన, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని ఉపయోగించిన జీపీఎస్ సహాయం చేత తెలిసిపోతుంది. అలా జరిగితే ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్టుమెంటల్ అధికారి, ఇతరులపై చర్యలు తీసుకుంటారు.

సీసీ కెమెరాల వద్దే ప్రశ్నపత్రం ఓపెన్...
పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు లీక్ గాకుండా ఉండేందుకై ఈ పర్యాయం ఆ పరీక్ష కేంద్రంలోని సీసీ కెమెరాల వద్దనే ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో విద్యార్థులను జంబ్లింగ్ విధానంలోనే హాల్ టికెట్లను జారీ చేసినట్లు తెలుస్తోంది. జంబ్లింగ్ విధానం తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల తీరుపై కూడా ప్రత్యేక నిఘాను ఉంచనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించగానే వారి వద్ద సెల్‌పోన్లను చీప్ సూపరింటెండెంట్‌కు అప్పగించి పరీక్ష ముగిసిన తర్వాత తీసుకోవ ల్సి ఉంటుంది. కాపియింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించి న వారిపై చర్యలు తీసుకునేందుకు అదికారులు సిద్ధ్దమయ్యారు.

పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం
జిల్లాలో జరిగే ఇంట ర్ మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అంతేగాకుండా కాపియింగ్‌కు పాల్పడకుండా ప్రత్యే క చర్యలు చేపడుతు న్నాం. ఎవరైనా ప్రైవేటు కళాశాలల వా రు హాల్‌టికెట్లు ఇవ్వకుం డా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలుంటాయని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం జీపీఎస్ నిఘా లో ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది ఉండదు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్లయింగ్, సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను నియమించాం. అంతేగాకుండా జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పా టు చేశాం. ఎవరైనా ఎక్కడై నా పరీక్షల్లో నిర్లక్ష్యం, కాపియింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే 08682-230058కు ఫిర్యాదు చేయవచ్చు.
-బి.హనుమంతరావు, డీఐఈఓ

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...