మతసామరస్యానికి ప్రతీక అబ్బాస్ దర్గా


Tue,February 19, 2019 03:15 AM

-ఈనెల 21నుంచి 23వరకు ఉర్సు ఉత్సవాలు
-దర్గాతోపాటు శివాలయంలోనూ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకత
మాల్ : చింతపల్లి మండలంలోని పీకేమల్లేపల్లిలోని గుట్ట వద్ద ఉన్న హజ్రత్ అబ్బాస్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రతి ఏడాది ఫిబ్రవరి 21నుంచి 23వరకు మూడ్రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడికి వేలసంఖ్యలో భక్తులు, వివిధ శాఖల మం త్రులతోపాటు జిల్లా అధికారులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. సుమారు 50సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ దర్గా సమీపంలోనే గుట్టపైన సీతారామాంజనేయ, గిరి మక్కామహేశ్వరస్వాముల ఆలయం ఉంది. దర్గా ఉత్సవాలతోపాటే ఈ ఆలయంలో ఉత్సవాల ను దర్గా నిర్వాహకులే నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.

ఉత్సవ కార్యక్రమాలు
ఈనెల 21న గురువారం రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు దర్గా ముత్తావలి మహమ్మద్ లతీఫ్ సాహెబ్ ఇంటి నుంచి గంధాన్ని భక్తజన సందోహంతో ఒంటెపై ఊరేగింపుగా తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తారు. 22 శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు, 23న శనివారం దీపారాధనలు, న్యాజులు(కుందూర్లు)నిర్వహించి భక్తులు మొ క్కులు చెల్లించుకుంటా రు. దీంతోపాటు గుట్టపైన ఉన్న శ్రీగిరి మక్కామహేశ్వరస్వామి 16వ వార్షికోత్సవంలో భాగం గా విఘ్నేశ్వరపూజ, శివ పంచాక్షరి యజ్ఞం, 22 న ఓం శ్రీగిరి మక్కామహేశ్వరస్వామి వారి కల్యా ణం, 23న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రానున్నందు న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...