మత్స్యకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి


Wed,February 13, 2019 01:48 AM

-ఎమ్మెల్యే రవీంద్రకుమార్
కొండమల్లేపల్లి: మత్స్యకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా రు. మంగళవారం మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్‌మార్కెట్‌లో సమీకృత మత్స్యఅభివృద్ధి పథకం(ఐఎఫ్‌డీఎస్) కిం ద 2018-19 సంవత్సరానికి గానూ మత్స్య కార్మికులకు రూ.50 లక్షల విలువైన 100 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను అందజేశారు.అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులు, రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రభుత్వం అం దించే పథకాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు డిండి ప్రాజెక్టు పరిధిలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. పెండ్లిపాకుల ప్రాజెక్టు పరిధిలోని మత్స్య కార్మికులకు వలలను సైతం అందించామన్నారు.

నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ప్రాజెక్టులు కలిగిన ప్రాం తంగా ఖ్యాతికెక్కిందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం రూ.6వేల ఐదు వందల కోట్లతో పరిపాలన అనుమతులు పూర్తయ్యాయని, డిండి ఎత్తిపోతలతో నియోజకవర్గంలో సాగు, తాగునీటితోపాటు మత్య్యకార కుటుంబాలు సైతం అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ ముచ్చర్ల ఏడుకొండలు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ కేసాని లింగారెడ్డి, ఎంబీసీ డివిజన్ కన్వీనర్ ఎలిమినేటి సాయి, సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్, పెండ్లిపాకుల మత్స్యసహకార సంఘం చైర్మన్ నేనావత్ బాలూనాయక్, టీఆర్‌ఎస్ నాయకులు నేనావత్ రాంబాబునాయక్, వస్కుల కాశయ్య, అల్గుల సైదిరెడ్డి, మధు, దస్రూ, శ్రీనునాయక్, బావండ్ల దుర్గయ్య, బషీర్, లక్ష్మణ్‌నాయక్, శంకర్‌నాయక్, నీరంజన్, ఎఫ్‌డీఓ మారయ్య, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తదితరులన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...