ప్రచార హోరు..


Thu,January 24, 2019 02:31 AM

-మూడో విడుత ‘పంచాయతీ’ ఎన్నికల్లో పోటీ తీవ్రతరం
-అభివృద్ధి నినాదంతో టీఆర్ బలపర్చిన అభ్యర్థులు
-రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కంచర్ల, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల, వేముల
-ఈనెల 28వరకు తుది విడుత ఎన్నికల ప్రచారం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించగా 22 నాటికి నామినేషన్ల తిరస్కరణ, అప్పీల్లు, పరిష్కారం, ఉపసంహరణ ముగిసింది. అయితే బుధవారం నుంచి ఆయా ప్రాంతాల్లో పలు పార్టీల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు ప్రచా రం కొనసాగనుండగా 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 30న 241 గ్రామ పంచాయతీలతోపాటు 2106 వార్డులకు ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ స్థానాలకు 767 మంది, వార్డు స్థానాలకు 5127 మం ది బరిలో నిలిచారు.
ఎన్నికల రోజే కౌంటింగ్, ఫలితం...
ఈనెల 28 సాయంత్రం ఐదు గంటల వరకు నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మునుగోడు, చండూరు, చిట్యాల, నార్కట్ కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు తేల్చనున్నారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం కానుంది. ఇప్పటికే దేవరకొండ డివిజన్ ఈనెల 21న ఎన్నికలు, ఫలితాలు వెలువడగా ఈ నెల 25న మిర్యాలగూడ డివిజన్ ఎన్నిక జరగనుంది.

అభివృద్ధే ఎజెండాగా టీఆర్ ప్రచారం...
గత నాలుగున్నర ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అబివృద్దిని చూపిస్తు సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని చెబుతూ గులాబి పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నామినేషన్ల నాటి నుంచే ప్రచారం ప్రారంబించగా మంగళవారం ఉపసంహరణలు పూర్తి కావడంతో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. నల్లగొండలో ఎంఎల్ కంచర్ల భూపాల్ మునుగోడులో మాజీ ఎంఎల్ కూసుకుంట్ల ప్రభాకర్ నకిరేకల్ మాజీ ఎంఎల్ వేముల వీరేశంలు టీఆర్ పార్టీ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ అభివృద్దిని చూపిస్తు టీఆర్ పట్టం కట్టాలని కోరుతూ ప్రజల ముందుకు వెళుతుండటంతో ప్రజల నుంచి సైతం భారీగా స్పందన లభిస్తోంది.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...