‘రెండో విడుత’కు రెడీ


Thu,January 24, 2019 02:28 AM

-రేపు మిర్యాలగూడ డివిజన్ పంచాయతీ ఎన్నికలు
-224సర్పంచ్, 1873వార్డులకు పోలింగ్
-సర్పంచ్ బరిలో 678, వార్డులకు 4123మంది
-ఎన్నికల విధుల్లో 5వేల మంది
-బందోబస్తుకు 1500పోలీసులు
మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25న మిర్యాలగూడ డివిజన్ 10 మండలాల పరిధిలో 224 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరుగనుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పాటు ఇతర పోలింగు సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు. సి బ్బంది, పోలింగ్ సామగ్రిని ఆయా పంచాయతీలకు తరలించేందుకు వాహనాలు సమకూర్చారు. 5000 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. బందోబస్తుకు 1500 మంది పోలీసులను నియమించారు.
మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి, అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెదవూర, తిరుమలగిరి(సాగర్) మండలాల పరిధిలో శుక్రవారం రెండో విడుత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. డివిజ న్ పరిధిలో మొత్తం 276 సర్పంచ్ స్థానాలకు గాను 52 సర్పంచ్ స్థానా లు, 2376 వార్డులకు గాను 563 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 224సర్పంచ్ స్థానాలకు678, 1873 వార్డుల స్థా నాలకు 4123 మం ది అభ్యర్థులు బరి లో నిలిచారు. వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

1873 పోలింగ్ కేంద్రాలు...
పంచాయతీ ఎన్నికల పోలింగ్ మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 1873 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టేజ్-1, అసిస్టెంట్ స్టేజ్-1 అధికారులు 170 మంది, స్టేజ్-2 అధికారులు 224 మంది, పీఓలు, ఏపీఓలు 3450 మంది, వీరికి అదనంగా మరి కొంతమంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు.
పటిష్ట బందోబస్తు...
డివిజన్ పరిధిలో 10 మండలాల పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు 5గురు డీఎస్పీలు, 25మంది సీఐలు, 50 మంది ఎస్ 1400 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టనున్నారు. బందోబస్తులో భాగంగా 75 మొబైల్ వాహనాలు, 10 ైస్ట్రెకింగ్ ఫోర్సు, 5 స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్సు టీంలు డివిజన్ వ్యాప్తంగా బందోబస్తులో పాల్గొననున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 18 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ 78 సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రో అబస్జర్వర్ నియమించాం. వీరు ఎప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికల తీరును ఉన్నతాధికారులకు నివేదిస్తారు. పోలింగ్ అయిపోగానే కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చాం.
- జగన్నాథరావు, ఆర్డీఓ, మిర్యాలగూడ

310
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...