తెలంగాణలో ముస్లింలకు సముచిత స్థానం


Thu,January 24, 2019 02:27 AM

-చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్
నీలగిరి: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు సముచితస్థానం దక్కిందని చార్మినార్ ఎమ్మె ల్యే ముంతాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బహుదూర్ కమ్యూనిటీహాల్ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఎంఐఎం ఆధ్వర్యంలో ఆల్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో ముస్లిం లు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు సముచిత గౌరవం ఇవ్వడంతోపాటు పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా కేటాయించని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. షాదీముబారక్ పథకాన్ని తెచ్చి నిరుపేద ముస్లిం మహిళల వివాహానికి లక్ష 16 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు. ముస్లింలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కేసీఆర్ సహకారంతో ముస్లింల అక్షరాస్యత శాతం పెరుగుతుందన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రుల్లో సీఎం కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ కలీం, నాయకులు ఖాజామెయినోద్దీన్, జబ్బార్ గౌస్ మెయినోద్దీన్, ఫయిమొద్దీన్, ఫయిమ్, హాశం, యూసుఫ్ పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...