కంటివెలుగు @ 6.19 లక్షలు


Wed,January 23, 2019 02:33 AM

-79,912 మందికి అద్దాలు అందజేత
-41,669 మందికి ఆపరేషన్ల కోసం రెఫర్
-3,91,156 మందికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారణ
నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం నల్లగొండ జిల్లాలో మంగళవారం 97వ రోజు కొనసాగింది. జిల్లాలో ఎక్కువగా మహిళలు పెద్ద ఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా వ్యా ప్తంగా 37 వైద్య బృందాలు ఇప్పటివరకు 6,19,195 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతనిధులు పలువురికి కళ్లద్దాలను అందజేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 32 చోట్లా, పట్టణ ప్రాంతాల్లో 5 చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 4769 మందికి పరీక్షలు చేయగా ఇందులో 2324 (ఇప్పటి వరకు 2,90,645) మంది పురుషులు, 2445 (ఇప్పటి వరకు 3,28, 515 ) మంది స్త్రీలు, 35మంది ఇతరులు పాల్గొన్నారు. ఇందు లో 262 (ఇప్పటి వరకు 79,912 ) మంది దగ్గర, దూరం చూపు సమస్యతో బాధపడుతుండగా వారిని పరీక్షించి కంటి అద్దాలు అందించారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర దవాఖానకు 285 (ఇప్పటి వరకు 41,669 )మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. ఈ రోజు జరిగిన పరీక్షలో 3,919 (ఇప్పటి వరకు 3,91,156) మందికి ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. మిగతా వారిని పరీక్షించి అవసరమైన వారికి మందులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మెడికల్ అఫీసర్లు, క్యాంపు కోఅర్డినేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...