టీఆర్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి


Wed,January 23, 2019 02:33 AM

-నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్
మిర్యాలగూడ అర్బన్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ పిలుపునిచ్చారు. మండలంలోని ఆలగడప, ఊట్లపల్లి, కొత్తగూడెం గ్రామాల్లో మంగళవారం టీఆర్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు పేరబోయిన చంద్రయ్య, నకిరేకంటి వెంకన్న, మద్దెల శ్రీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందాలన్న, సమస్యలు పరిష్కారం కావాలన్నా టీఆర్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదరణ చూరగొన్నాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక వాటిని మరింత మందికి అందేలా అమలు చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణకోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నూతన జిల్లాలు, మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ధనావత్ చిట్టిబాబునాయక్, జడ్పీటీసి మట్టపల్లి నాగలక్ష్మి సైదులు, నూకల సరళ హనుమంతరెడ్డి, నిమ్మల చినముత్తయ్య, చింతకాయల సోమయ్య, పూసపాటి రాజయ్య, వెంకటేశ్వర్లు, సైదులు, రాములు, లక్ష్మయ్య, మచ్చ సోమేష్, రామచంద్రయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...