టీఆర్ చేరికల జోష్


Wed,January 23, 2019 02:32 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ వివిధ పార్టీల నుంచి చేరికల జోష్ కొనసాగుతోంది. మంగళవారం మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన సీపీఎం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 100 మంది ఎంపీ గుత్తా సుఖేందర్ సమక్షంలో టీఆర్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. పార్టీలో చేరిన వారిలో చిలక యాదగిరిరెడ్డి, నాగరాజు,నాగేష్, సైదులు, వెంకన్న, జావేద్,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డి, మన్నెం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...