గణతంత్ర వేడుకలకు సిద్ధమవ్వాలి


Wed,January 23, 2019 02:32 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఈనెల 26న నిర్వహించేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ గౌరవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ తన చాంబర్ గణతంత్ర వేడుకలపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పోలిస్ పరేడ్ వీఐపీలు, స్వా తంత్య్ర సమరయోధులు, జిల్లా అధికారులకు సీటింగ్ ఏర్పాటు చేయడంతో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థినివిద్యార్థులచే జాతీయ సమైక్యత, సమగ్రత ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. అదేవిధంగా శకటాల ప్రదర్శనతోపాటు పలు శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికి చూపించాలన్నారు. 108 అంబులెన్స్, మెడికల్ బృందాలు సైతం పరేడ్ గ్రౌండ్ ఉండాలని విద్యుత్ అంతరా యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. సాయంత్రం సమయంలో కలెక్టర్ బంగ్లా ఎట్ కార్యక్రమం, టౌన్ సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...