ఓటెత్తిన పల్లెలు..


Tue,January 22, 2019 01:55 AM

- దేవరకొండ డివిజన్ పోలింగ్ శాతం91.44
- తొలివిడుత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
- ఉదయం 7గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్
- పల్లెలు, తండాల్లో వెల్లివిరిసిన చైతన్యం
- గుర్రంపోడు మండలంలో అత్యధికంగా 93.76 శాతం పోలింగ్
- చందంపేట మండలంలో అత్యల్పంగా 86.98 శాతం పోలింగ్
- ఎస్పీ ఏవీ రంగనాథ్, జేసీ కలెక్టర్ నారాయణరెడ్డి నిరంతర పర్యవేక్షణ
దేవరకొండ, నమస్తేతెలంగాణ :దేవరకొండ రెవెన్యూ డివిజన్ సోమవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పల్లెలు, తండాలు ఓటెత్తగా.. ఓట్ల జాతర సంబురంగా సాగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగగా... ఓటర్లు ఉత్సాహం చూపడంతో డివిజన్ వ్యాప్తంగా 252 పంచాయతీల్లో సంతృప్తికరమైన పోలింగ్ శాతం నమోదైంది. 10మండలాల పరిధిలో సగటున 91.44 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 93.76శాతం, అత్యల్పంగా చందంపేట మండలంలో 86.98 శాతం నమోదైంది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టడంతో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఎస్పీ ఏవీ.రంగనాథ్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి పలు మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని ఎప్పటికికప్పుడు సమీక్షించారు.’
దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ రెవెన్యూ డివిజన్ తొలివిడుతగా సోమవారం జరిగిన పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 304 గ్రామ పంచాయతీలు ఉండగా 52 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,572 వార్డులకు 650 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 252 పంచాయతీలకు 666 మంది బరిలో ఉండగా, 1,919 వార్డులకు 4,281 మంది పోటీ పడ్డారు. డివిజన్ వ్యాప్తంగా 2,60,256 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ 2,37,981 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,20,571 మంది ఉండగా స్త్రీలు 1,17,410 మంది ఉన్నారు.

ఉదయం 10 గంటలకే 80 శాతం పోలింగ్
దేవరకొండ డివిజన్ సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ ఆరంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. చాలా వరకు కేంద్రాల్లో బారులు తీరగా ఓపిగ్గా క్యూ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తం డా లు, పల్లెల్లో ఉన్న వృద్ధులు, మంచానికే పరిమితమైనవా రు కూడా తమ బం ధువుల సాయంతో ఓటింగ్ పాల్గొన్నారు. లేవలేని, నడవలేని పరిస్థితిలో ఉన్నవారిని అభ్యర్థులే ప్రత్యేక చొరవ చూపి ఆటోలు, ఇతర వాహనాలలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 10 గంటలకే 80 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ చివరి వరకు కేవలం 10, 20 ఓట్లు మాత్రమే మిగిలిపోవడంతో సిబ్బంది ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించారు.

2 గంటల నుంచి కౌంటింగ్
పోలింగ్ ముగిసిన తరువాత భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 4 గంటల నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ రాత్రి వరకు కూడా కొనసాగింది. సర్పంచ్ ఫలితాలు వచ్చిన చోట నూతన పాలకవర్గంతో స్టేజ్ -2 అధికారులు ఉప సర్పంచ్ ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించారు.
పర్యవేక్షించిన ఎస్పీ, జేసీ
దేవరకొండ డివిజన్ జరిగిన పోలింగ్ సరళిని జిల్లా అధికారులు సమీక్షించారు. జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి ఎప్పటి కప్పుడు సమీక్షించి పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించగా, జేసీ నారాయణరెడ్డి డిండి, కొండమల్లేపల్లి, గుర్రంపోడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు కిందిస్థాయి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో వాతావరణంలో జరిగేలా తమ వంతు పాత్ర పోషించారు.

269
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...