పశుగ్రాసం కొరతకు చెక్..


Tue,January 22, 2019 01:54 AM

-జిల్లా వ్యాప్తంగా 275 మెట్రిక్ విత్తనాల కేటాయింపు
-ఇప్పటికే 75 మెట్రిక్ టన్నులు అందజేసిన అధికారులు
-వేసవిలో కొరత నివారించేందుకే ముందస్తు చర్యలు
-50 శాతం సబ్సిడీతో జిల్లా రైతాంగానికి అందజేత
నల్లగొండ, నమస్తేతెలంగాణ: పశుగ్రాసంకొరతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిలో పాడి పశువులకు పచ్చి గడ్డి అందించాలనే ఉద్దేశంతో 50 శాతం సబ్సిడీతో పాడిరైతాంగానికి విత్తనాలను అందజేస్తోంది. జిల్లా వ్యా ప్తంగా 275 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరమని పశు సంవర్ధక శాఖ యంత్రాంగం అంచనా వేయగా అందులో ఇప్పటికే 75 మెట్రిక్ టన్నుల విత్తనాలు దిగుమతి కావడంతో సరఫరా చేశారు. మరో 200 మెట్రిక్ టన్నుల విత్తనాలను త్వరలో అందజేయనున్నారు. మార్చి, ఏప్రిల్ గడ్డికొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో సబ్సిడీ విత్తనాలు అందజేస్తుండగా ఆయకట్టులో రైతులు పాడి పశువులను దృష్టిలో పెట్టుకుని గడ్డి పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక నాన్ ఆయకట్టులోను బోరు బావుల కింద ఉన్న భూమిలో కొంత మేరకు ఈ విత్తనాలను చల్లి వేసవి ఎద్దడి నుంచి బయట పడేందుకు జాగ్రత్త పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వేసవికి ముందే పాడి పశువులు, గొర్రెలు,మేకలకు పశుగ్రాసం కొరత ఉండవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే సబ్సిడీలో విత్తనాలను అందజేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది సైతం సర్కార్ 50 శాతం సబ్సిడీతో జొన్న లు రైతాంగానికి అందేలాచర్యలు చేపట్టింది. 275 మెట్రిక్ టన్ను లు అవసరం ఉండగా ఇప్పటికే 75 మెట్రిక్ టన్నులు ఇచ్చింది.
జిల్లాలో 5లక్షల పశువులు ఉండగా 11లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు ఇటీవల కురిసిన మంచు లేదంటే బోరుబావులు, ఆయకట్టు, ఏఎమ్మార్పీ కింద నీటి విడుదల జరుగుతుండటంతో ఆ వనరుతో పెరిగిన గడ్డినే తినే అవకాశం ఉంది. అయితే పాడి పశువులకు వేసవిలో పచ్చి గడ్డి అవసరమైన నేపథ్యంలో ఈ విత్తన సరఫరాను చేస్తోంది.

జిల్లాకు 275 మెట్రిక్ టన్నుల విత్తనాలు...
వేసవి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో పాడి పశువులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఇండెంట్ మేరకు 275 మెట్రిక్ టన్నుల విత్తనాల ను అందజేయనుంది. ప్రధానంగా మార్చి, ఏప్రిల్ గడ్డి కొరత వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే విత్తనాలు సరఫరా చేస్తే చల్లుకుంటారనే ఉద్దేశంతో 50 శాతం సబ్సిడీతో అందజే స్తోంది. అందులో ఇప్పటికే 75 మెట్రిక్ టన్నుల విత్తనాలు జిల్లాకు చేరగా వాటిని ఆయా పశు సంవర్ధక శాఖ కార్యాలయాల సబ్సిడీలో అందజేశారు. మిగిలిన 200 మెట్రిక్ టన్నుల విత్తనా లు త్వరలో రానున్నాయి. 5 కేజిల బ్యాగ్ ధర రూ. 95 ఉండగా సబ్సిడీ పోను రైతు రూ. 45 చెల్లిస్తే సరిపోతుంది.

పాడి పశువులను దృష్టిలో పెట్టుకుని....
జిల్లాలో 5 లక్షల పాడి పశువులు ఉండగా 11 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైన నాటి నుంచి స్టయిలో విత్తనాలను రైతులకు సబ్సిడీలు అందజేయగా అటవీ శాఖ యంత్రాంగం సైతం వీటిని అటవీ ప్రాంతంలో చల్లారు. అంతేగాక ఇటీవల కురిసిన మంచు, ఏఎంఆర్ ఎడమ కాల్వ పరిధిలో నీటి విడుదల నేపథ్యంలో కాల్వల వెంట గడ్డి అందుబాటులో ఉంది. అంతేగాక ఈసారి రబీలోను సాగునీటి విడుదల నేపథ్యంలో వరి సాగు పెరుగుతుంది. ఈ నేపధ్యంలో గొర్రెలు, మేకలకు పెద్దగా గడ్డి కొరత ఉండబోదు. అయితే పాడి పశువులకు పచ్చి గడ్డి అందజేయాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలో ఈ విత్తనాలను అందజేస్తోంది.

వేసవిలో కొరతను నివారించేందుకే....
సాధారణంగా జూన్ నుంచి జనవరి వరకు పశుపక్ష్యాదులకు నీటితో పాటు గడ్డికొరత కూడా పెద్దగా ఉండదు. జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తుండగా ఆ తర్వాత జనవరి వరకు మంచు ప్రభావం ఉంటుంది. ఈ నేపధ్యంలో గొర్రెలు, మేకలతో పాటు పశువులకు కూడా పచ్చిగడ్డి లభిస్తోంది. అయితే ఫిబ్రవరి నుంచి మే వరకు ఈ నాలుగు నెలలు వేసవి నేపథ్యంలో గడ్డి కొరత ఉండటం వల్ల దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఏటా సబ్సిడీలో విత్తనాలు అందజేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ముందస్తుగానే ఈ సబ్సిడీ విత్తనాలను రైతాంగానికి అందజేసేలా చర్యలు చేపట్టింది.
జిల్లాకు 275 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పశువులు, జీవాలకు 275 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు అవసరం ఉండగా ప్రభుత్వం ఇప్పటికే అందులో 75 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేసింది. మరో 200 మెట్రిక్ టన్నుల విత్తనాలు రానున్నాయి. వచ్చిన విత్తనాలను మండలాల్లోని పశు సంవర్దక శాఖ అధికారుల ద్వారా 50 శాతం సబ్సిడీతో అందజేస్తాం.
-సీహెచ్. రమేష్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...