కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ


Tue,January 22, 2019 01:53 AM

-చింతపల్లిలో టాస్ టీఆర్ అభ్యర్థి విజయం
దేవరకొండ, నమస్తేతెలంగాణ : పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కొన్ని చోట్ల ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్ వరకు నువ్వా..నేనా..అన్నట్లుగా విజయం దోబూచులాడడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవ్వాల్సివచ్చింది. డివిజన్ అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కొండమల్లేపల్లి ఫలితం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య హోరా హోరీగా సాగిన పోరులో చివరికి ఇండిపెండెంట్ అభ్యర్థి కుంభం శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. డిండి మండల కేంద్రంతో పాటు గోనబోయినపల్లి పంచాయతీల ఫలితాలు సైతం తీవ్ర ఉత్కంఠతను రేపాయి. గోనబోయినపల్లిలో 8 ఓట్లతో టీఆర్ అభ్యర్థి గెలిచినప్పటికీ రీకౌంటింగ్ చేయాల్సి వచ్చింది. చింతపల్లి మండలం జర్పుల తండాలో టీఆర్ బలపర్చిన అభ్యర్థి జర్పుల నిర్మల, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జర్పుల చిన్నగోరికి మధ్య చివరి వరకు ఉత్కంఠత సాగింది. ఇద్దరికి చెరో 169 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు టాస్ వేయగా టీఆర్ అభ్యర్థి జర్పుల నిర్మలను విజయం వరించింది. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామ పంచాయతీలో అత్తా కోడళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా రాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం కోడలే నెగ్గింది. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జూలూరి ధనలక్ష్మి సర్పంచ్ ఎన్నికైంది. పీఏపల్లి మండల కేంద్రంతో పాటు అంగడిపేట పంచాయతీలో టీఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు రాత్రి 11 గంటల వరకు కొనసాగింది.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...