టీఆర్ సునామీ


Tue,January 22, 2019 01:53 AM

-పంచాయతీల్లో కారు జోరు
- ప్రభావం చూపని ప్రతిపక్షాలు
దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓటర్లు ప్రగతికే పట్టం కట్టారు. మెజార్టీ పంచాయతీల్లో టీఆర్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. దీంతో టీఆర్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. జె కేసీఆర్.. జై కేటీఆర్..జై టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
ప్రగతికి పట్టం కట్టిన ప్రజానీకం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో ప్రగతికే ప్రజానీకం పట్టం కట్టారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేశారు. దీంతో మొన్నటి శాసన సభ ఎన్నికల్లో వివిధ పథకాల లబ్ధిదారులే టీఆర్ గెలిపించుకోగా పంచాయతీలోనూ అదే స్ఫూర్తిని కనబర్చారు. ఇంటి ముందు పాలన.. కంటి ముందు ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లిన పార్టీ అభ్యర్థులను ప్రజలు ప్రజలు విశ్వసించారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షగా భావించి ఆశీర్వదించారు.
పంచాయతీల్లో టీఆర్ హవా
పల్లెపోరులో టీఆర్ హవా కొనసాగింది. దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 304 గ్రామ పంచాయతీలు ఉండగా టీఆర్ -195 స్థానాలను, కాంగ్రెస్ - 94 స్థానాలను, టీడీపీ -2, సీపీఐ -3, బీజేపీ- 3, ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం పంచాయతీల్లో ఎన్నికలకు ముందే 52 సర్పంచ్ స్థానాలు, 650 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కూడా 50 స్థానాలను టీఆర్ దక్కించుకొని అగ్రస్థానంలో నిలవడం విశేషం.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...