నేడే తొలివిడుత పోలింగ్


Mon,January 21, 2019 12:40 AM

- 252 సర్పంచ్, 1,914 వార్డు స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- సర్పంచ్ బరిలో 666, వార్డుల బరిలో 4,276 మంది పోటీ
- ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
- అనంతరం ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న తొలిపోరులో సర్పంచ్ స్థానాలకు 666 మంది, వార్డు స్థానాలకు 4,276 మంది పోటీ పడుతున్నారు. డిండి మండలం శాంతిగూడెం పంచాయతీ పరిధిలోని 4వ వార్డుకు, పీఏపల్లి మండలం గట్టు నెమలిపూర్ పంచాయతీ పరిధిలోని 3వ వార్డుకు, గుర్రంపోడు మండలం మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని 6వ వార్డుకు నామినేషన్లు దాఖలైనప్పటికీ వయస్సు అర్హత లేకపోవడం. ఇతర కారణాలతో స్కూృట్నీలో దాఖలైన నామినేషన్లు అన్నీ తిరస్కరించబడ్డాయి. దీంతో ఆయా వార్డులకు పోటీచేసే అభ్యర్థులు లేకపోవడంతో వీటికి త్వరలోనే ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 73 సమస్యాత్మక, 29 అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 18 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుండగా మరో 171 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు
- పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య ఆధారంగా ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు.
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. సున్నిత, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీడియో చిత్రీకరణ కూడా చేపడుతున్నారు.
- కోసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వీల్ చైర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.
- ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద నిర్మించే ర్యాంపులు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉపయోగపడబోతున్నాయి.
- వేసిన వ్యక్తి ఎడమచేతి మధ్యవేలికి ఇంకు గుర్తును పెడతారు.

పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి...
తొలి విడత ఎన్నికల్లో స్టేజ్-1, అసిస్టెంట్ స్టేజ్-1 అధికారులు 186 మంది, స్టేజ్-2 అధికారులు 252 మంది, పీఓలు, ఏపీఓలు 3,828 మంది వీరికి అదనంగా మరో 10 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో ఆదివారం మధ్యాహ్నమే బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి వారు అక్కడే బసచేయనున్నారు. సోమవారం 1 గంట వరకు పోలింగ్‌ను ముగించి మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచులను ఎన్నుకోనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది సిబ్బందికి తగ్గకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తుండగా 2,350 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు సిబ్బందిని తరలించేందుకు గాను ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల తతంగం పూర్తయ్యాక సిబ్బందిని స్వస్థలాలకు చేరవేసేందుకు 20 ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నారు.

గుర్తింపుకార్డు చూపిస్తేనే ఓటు...
ఇప్పటికే ఫొటో ఓటర్ చిట్టీలను అధికారులు ఓటర్లకు పంపిణీ చేశారు. బూత్ లెవెల్ అధికారుల ద్వారా గ్రామ పంచాయతీ వార్డుల వారీగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన ఫొటో ఓటర్ చిట్టీలను పంపిణీ చేశారు. ఈ చిట్టీ చూపితే వేరే గుర్తింపు కార్డు చూపాల్సిన అవసరం లేదు. ఓటరు చిట్టీ అందని వారు ఫొటో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు సహా ఇతర 23 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు.

ఓట్ల లెక్కింపు ఇలా...
సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పెట్టెలను ముందుగా గుర్తించిన లెక్కింపు గదిలోనికి తరలిస్తారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెల సీలు తొలగించి సర్పంచ్, వార్డు బ్యాలెట్ పత్రాలను వేరు చేస్తారు.
- రంగు బ్యాలెట్ పత్రం సర్పంచ్ అభ్యర్థులకు, తెలుపు రంగు బ్యాలెట్ పత్రం వార్డు సభ్యులకు ఇస్తారు.
- పెట్టె తెరిచిన తరువాత మొదట గులాబీ, తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వేరుచేస్తారు.
- రంగు బ్యాలెట్ పత్రాలు ఒక పెద్ద డబ్బాలో వేస్తారు. వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను వార్డుల వారీగా వేరు చేసి 25 బ్యాలెట్ పత్రాలు చొప్పున ఒక కట్ట కడతారు. ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులకు వచ్చిన బ్యాలెట్లను ఎదురుగా ఉన్న ట్రేలలో విభజన చేస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా వేరుచేసిన బ్యాలెట్ పత్రాలను మళ్తీ 25 చొప్పున కట్టలుగా కట్టి లెక్కించి ఫలితం వెల్లడిస్తారు.

- స్థానాల్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత సర్పంచ్ స్థానానికి అన్ని వార్డుల్లో వచ్చిన ఓట్లను ఒక డబ్బాలో కలిపి 25 చొప్పున కట్టలు కడుతారు. మొత్తం పోలైన ఓట్లు, వచ్చిన ఓట్ల లెక్క తేలిన తర్వాత 25 చొప్పున కట్టిన బ్యాలెట్ పత్రాల కట్టలను వేరు చేసి అభ్యర్థుల గుర్తుల వారీగా ట్రేలలోకి విభజిస్తారు. ఆ తరువాత గుర్తుల వారీగా వచ్చిన బ్యాలెట్ పత్రాలను మళ్లీ 25 చొప్పున కట్టలు కడతారు. ఈ విధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. ఇలా లెక్కించిన తరువాత ఎక్కువ ఓట్లు దక్కిన అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.
- ఓట్లు లభించి ఎన్నికైన వారికి స్టేజ్ -2 అధికారి ధ్రువీకరణ పత్రం అందిస్తారు.
- పత్రం జారీ చేసిన అధికారి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమావేశమై ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. కోరం పూర్తయ్యాక అప్పుడు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగకుంటే మరుసటి రోజు ఎన్నుకుంటారు. మళ్లీ కోరం పూర్తవ్వకపోతే ఉపసర్పంచ్ ఎన్నికకు మరో రోజు సమావేశం నిర్వహిస్తారు.
- ఎన్నికైన గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఫలితాలు వెలువడిన వెంటనే అధికారంలోకి రావు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తేదీని ప్రకటిస్తుంది. ఆ తేదీన కలెక్టర్ నియమించిన ప్రత్యేకాధికారి పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ రోజు నుంచి కొత్త పాలక వర్గం కొలువుదీరుతుంది.

333
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...