ఆర్డీఓకు 19మంది అప్పీల్


Mon,January 21, 2019 12:37 AM

- 9 మంది సర్పంచ్, 10 మంది వార్డు అభ్యర్థులు
- నేడు అభ్యర్థుల సమక్షంలో పరిష్కారం
నల్లగొండ, నమస్తే తెలంగాణ : నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తిరస్కరించబడిన వారు కారణాలు కోరుతూ ఆదివారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో అప్పీల్ చేసుకుని పరిష్కారం కోరారు. డివిజన్ వ్యాప్తంగా 257 సర్పంచ్ స్థానాలు , 23 22 వార్డు స్థానాలు ఉండగా అందులో సర్పంచ్ స్థానాలకు 2153, వార్డు స్థానాలకు 7962 మం ది నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు డబు ల్ సెట్లు వేయగా వాటిని క్లస్టర్లలో ఎన్నికల యం త్రాంగం పక్కన పెట్టింది. పలు కారణాలతో కొన్ని నామినేషన్లను రిజక్టు చేయగా వారిలో 19 మంది కారణాలను అడుగుతూ ఆర్డీఓను ఆశ్రయించారు. ఇందులో 9 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉండగా 10 మంది వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన వారు ఉన్నారు. ఇందులో డివిజన్‌లోని పెద్ద గ్రామ పంచాయతీ నార్కట్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రస్తుత జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య సతీమణి అండాలు సైతం ఉన్నారు. వీరందరికి నేడు ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి తిరస్కరణకు గల కారణాలను వివరించనున్నారు. అలాగే అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, 22 నుంచి ప్రచార పర్వం మొదలుకానుంది.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...