ఎన్నికల విధులకు గైర్హాజరైన వారి జాబితా ఎన్నికల కమిషన్‌కు..


Mon,January 21, 2019 12:37 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు ఎలాంటి అనుమతులు లేకుండా గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. తొలి విడుత ఎన్నికలు జరుగుతున్న దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లోని దేవరకొండ, కొండమల్లేపల్లి, పీఏపల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధులు అలాటు అయినవారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సంతకాలు చేసి విధులకు హాజరు కాకుండా వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిం దన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకు న్నామ ని, గైర్హాజరైన వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు చర్యల నిమిత్తం పంపుతున్నట్లు తెలిపారు. గతంలో గైర్హాజరైన వారిపై కలెక్టర్ స్థాయి లో చర్యలు ఉండేవని, ఈసారి మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయంగా చర్యలు తీసుకో నుందని పేర్కొన్నారు.

తొలి విడుత ఎన్నికలను ప్రశాంత వాతా వరణంలో జరిపేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. ప్రతి మండలానికి ముగ్గురు జిల్లా స్థాయి అధికారు లను నియమించడంతో పాటు పంచాయతీరాజ్, ఆర్‌డ బ్ల్యూఎస్, ట్రాన్స్‌కోకు చెందిన ఇంజినీర్లను అందుబాటులో ఉంచామని, అత్యవసర వైద్యం కోసం డాక్టర్లతో పాటు ఆంబులెన్స్‌లను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచినట్లు చెప్పారు. పోలింగ్, కౌంటిం గ్‌కు ఎవరైనా అవరోధాలు సృష్టిస్తే వారిని అక్కడే అరెస్టు చేస్తామ ని హెచ్చరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలలో స్థానిక పోలీసులతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి బలగాలను మోహరింప చేశామని, వెబ్ కాస్టింగ్‌తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్లు వివరించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీవో గుగులోతు లింగ్యానాయక్ ఉన్నారు.

గైర్హాజరైన ఉద్యోగుల వేతనం కట్
నల్లగొండ, నమస్తే తెలంగాణ: దేవరకొండ డివిజన్‌లో నేడు జరిగే పంచాయతీ ఎన్నికలకు కేటాయించిన ఉద్యోగులు విధులకు హాజరై రిపోర్టు చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రిపోర్టు చేయని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర అధికారులపైనా చర్యలు తప్పవన్నారు. దేవరకొండ డివిజన్‌లో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే సంబంధిత ఎన్నికల యంత్రాంగం విధులకు హాజరు కాలేదన్నారు. మొదటి రోజు ఎవరెవరూ విధులకు హాజరు కావడం లేదో జిల్లా పంచాయతీ అధికారులు జాబితా తయారు చేసి అందించాలని సూచించారు. విధులకు హాజరు కాని వారికి మూడ్రోజుల వేతనం నిలిపివేయడంతో పాటు ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

274
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...