సాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,January 21, 2019 12:36 AM

నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌కు శని, ఆదివారాల్లో అధికసంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీ పర్యాటకులు, టీవీ సీరియల్ నటులు సందర్శించడంతో సాగర్‌లో పర్యాటకులతో సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనపరిచారు. నాగార్జునకొండలో బుద్ధుడి జీవిత గాథలకు సంబంధించిన శిల్పాలను పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియం, మ్యూజియం వెలుపల గల యజ్ఞశాల, చైత్యాలు, సింహాల విహారంలో ఎత్తైన బుద్ధ్దుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, నేలపై అలనాడు ఇటుకలతో ఏర్పా టు చేసిన స్వస్తిక్ గుర్తు వాటితో నాగార్జునకొండలో అలనాటి నదిలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలు తెలుసుకున్నారు. శ్రీపర్వతారామం(బుద్ధవనం)లోని గోపు రం పైన, మ్యూజియంలో అమర్చిన శిల్పాలను, స్తూపపార్కు, ధ్యానవనం, బుద్ధ్దచరితవనం, మహాస్తూపపార్కు ప్రాంతాలలో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. ఈటీవి గంగా యమున సీరియల్ నటి శీలం స్నేహితులతో నాగార్జునకొండను సందర్శించారు. తెలంగాణ టూరిజం నాగార్జునకొండకు 4 ట్రిప్పులు లాంచీలను నడపడంతో శని, ఆదివారాలలో రూ.1,05,000 ఆదాయం వచ్చిందని మేనేజర్ హరిబాబు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు లాంచీ టిక్కెట్లు ధరలో ప్రత్యేకరాయితీని కల్పిస్తున్నామని, పాఠశాల గుర్తింపు స్టాంపును తీసుకురావాలన్నారు. పర్యాటకులతో లాంచీస్టేషన్, బుద్ధవనం, దయ్యాలగండి, డ్యాం ప్రాంతాలు కిటకిటలాడాయి.

301
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...