తొలిపోరుకు సర్వం సిద్ధం


Sun,January 20, 2019 02:17 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ: దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చందంపేట, నేరడుగొమ్ము, చింతపల్లి, పిఏపల్లి, మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడు మండలాల పరిధిలో సోమవారం తొలివిడుత ఎన్నికలు జరుగనున్నాయి. డివిజన్ పరిధిలో మొత్తం 304 సర్పంచ్ స్థానాలకు గాను 52 సర్పంచ్ స్థానాలు, 2,572 వార్డు స్థానాలకు గాను 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు వార్డు స్థానాలకు అభ్యర్థులు లేక ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 252 సర్పంచ్ స్థానాలకు, 1,914 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
2,174 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ కోసం డివిజన్ వ్యాప్తంగా 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 106 రూట్లను ఏర్పాటు చేయగా స్టేజ్-1, అసిస్టెంట్ స్టేజ్-1 అధికారులు 186 మంది, స్టేజ్-2 అధికారులు 252 మంది, పీఓలు, ఏపీఓలు 3,828 మంది వీరికి అదనంగా మరో 10 మందిని ఎన్నికల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియడంతో సోమవారం 1 గంట వరకు పోలింగ్ ముగించి మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. దేవరకొండలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్లు, సిరా, స్వస్తిక్ గుర్తులు వేసేందుకు స్టాంపులు తదితర సామగ్రిని ఆదివారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
పటిష్ట బందోబస్తు
దేవరకొండ డివిజన్ 73 సమస్యాత్మక, 29 అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించగా వీటిపై పోలీస్ ప్రత్యేక నిఘా పెడుతోంది. 2 వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు పారా మిలటరీ, సిటి ఆర్మ్ రిజర్వ్ సంబంధించి 5 కంపెనీలకు చెందిన 350 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నాయి. ప్రతి రూటులో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడంతోపాటు, పోలీస్ వాహనాలకు విహెచ్ సెట్టును ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. దేవరకొండలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణను ఉంచుతున్నారు.

211
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...