ప్రజాసామ్య విలువలను కాపాడాలి


Sun,January 20, 2019 02:16 AM

మునగాల : ప్రపంచంలో భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని దాని విలువలు ప్రతి ఒక్కరూ కాపాడాలని ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించేలా ప్రోత్సాహించాలన్నారు. జిల్లాలో నిర్వహించే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు జరిగేలా కృషిచేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో మోదటి విడతగా 7 మండలాలో 160 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగుతున్నాయని అన్నారు.మునగాల సర్కిల్ పరిధిలో 15 రూట్ మ్బుల్స్ ను ఏర్పాటు చేయటం జరిగినదని తెలిపారు. ఒకొక్క మండలానికి ఒక్క సీఐ ని నియమించినట్లు తెలిపారు. మూడు మండలాలకు ఒక్క డీఎస్పీ ఇంచార్జీ గా ఉంటారని తెలిపారు. రూట్ మొబైల్స్ వివాదాలు జరిగిన ప్రదేశానికి 5,10 నిమిశాలలో చేరుకుంటారన్నారు. పోటీల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం పోలీస్ సిబ్బంది రక్షణ కల్పిస్తుందన్నారు. ఎన్నికల నియమావళిని అతి క్రమిస్తే వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సుదర్శ్ సీఐ లు శివశ ంకర్ భాస్కర్, ఎస్ లు మహిపాల్ సంతోష్, నగేష్, బాలు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...