44 గంటల ముందే ప్రచారం నిషేధం


Sat,January 19, 2019 02:04 AM

-సాయంత్రం 5 గంటల వరకే..
19న మొదటి విడుత, 23న రెండో విడుత, 28న మూడో విడుత ప్రచారం ముగింపు
-నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు
-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
రామగిరి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భం గా ఎన్నికల పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచే ఎటువంటి పబ్లిక్ మీటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ చానె ల్స్, రేడియో ద్వారా ప్రచార కార్యక్రమాలు పోటీ చేసే అభ్యర్థులు నిర్వహించరాదని కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తం గా 3 విడతల్లో జరిగే ఎన్నికల్లో భాగంగా ఈనెల 21న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈనెల 19 సాయంత్రం 5 గంటల నుంచి, రెండో విడుత ఈనెల 25కు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు, మూ డోవిడత ఎన్నికలు జరిగే ఈనెల 30న ప్రాం తాలకు ఈనెల 28 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిషేధిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ చానెళ్లు, బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రచారం చేపట్టరాదని పేర్కొన్నారు. అదేవిధంగా కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిని కూడా చేపట్టవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించినచో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
పోర్టల్ ద్వారా ఓటర్ స్లిప్పులు లభ్యం
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ ఎపిక్ నెంబర్ తెలియనప్పటికీ కూడా ఓటర్ పోర్టల్ ద్వారా ఓటర్ స్లిప్పులను పొందవచ్చని రాష్ట్ర ఎన్నికలసంఘం కార్యదర్శి అశోక్ ప్రకటనలో తెలిపారు. tsec.gov.in అనే వెబ్ ని voterportalద్వారా ఓటర్ స్లిప్పు డౌన్ చేసుకోవచ్చన్నా రు. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ , ఓటర్ పేరు నమో దు చేసి తమ ఓటర్ స్లిప్పును పొందవచ్చని సూచించారు.
ఎడమకాల్వకు నీటి విడుదల

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...