హక్కుల సాధనకే... ఫెడరల్ ఫ్రంట్


Fri,January 18, 2019 12:50 AM

- పొత్తు అనేది టీడీపీ నేతల అనైతిక వ్యాఖ్య
- ఆంధ్రప్రజలను తప్పుదోవ పట్టించడానికే చంద్రబాబు కుట్రలు
- దేశ ప్రజలు బీజేపీ,కాంగ్రెసేతర పాలన కోరుకుంటున్నారు..
- విలేకరుల సమావేశంలో ఎంపీ గుత్తా
నల్లగొండ, నమస్తే తెలంగాణ: దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ర్టాల హక్కుల సాధన కోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోను ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా వైసీపీ అధినేత జగన్‌ను కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ కలిసినట్లు తెలిపారు. రాష్ర్టాలకు రావల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని దేశంలో మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని.. ఇవన్నీ సెక్యులర్ పార్టీలే అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవి తట్టుకోలేక కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో నేను మూడో ఫ్రంట్‌కు చక్రం తిప్పగా ఈసారి కేసీఆర్ తిప్పుతున్నాడనే ఆలోచనతో కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రలో వైసీపీ పార్టీ.. ఎక్కడ పార్టీలు అక్కడే పోటీ చేస్తున్నాయని ఈ రెండు పార్టీలు ఎలా పొత్తులు పెట్టుకుంటాయో చెప్పాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ నేతలు చేసినటువంటి విమర్శలు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందనే భయందోళనలో ఉన్నారన్నారు.

వైసీపీ, టీఆర్‌ఎస్ కలయిక ఎన్నికల పొత్తు కాదని ఇది పెడరల్ ఫ్రంట్‌లో భాగమే అని తెలియజేశారు. ఆంధ్రప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి దాకా బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు మోదీకి దూరమై మోదిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్, జగన్‌లను మోదీలాగా అభివర్ణించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రలో టీడీపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఈ కుట్రలు పన్నుతున్నట్లు ఎంపీ తెలిపారు. తెలుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉంటేనే కేంద్రం నుంచి రావల్సిన నిధులు వస్తాయన్నారు. లేదంటే వెనక్కిపోయే ప్రమాదముందన్నారు. చంద్రబాబు అబద్దాల కోరుగా అభివర్ణించిన ఎంపీ గుత్తా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏపీ భవనాలు శిథిలమవుతున్నప్పటికి తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు స్వాధీనం చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, వైఖరిని నిరసిస్తూనే ఇవాళ్ల అన్ని రాష్ర్టాల నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించటానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నాడని, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధ్ది ముందు ఆకుట్రలు నిలువలేదన్నారు. సమావేశంలో తిప్పర్తి, నల్లగొండ ఎంపీపీలు పాశంరాంరెడ్డి, దైద రజిత, నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, యామ దయాకర్ పాల్గొన్నారు.

294
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...