మహాత్మాకు మరో గౌరవం


Fri,January 18, 2019 12:49 AM

ఎంజీ యూనివర్సిటీ: అది ఉన్న విద్య నిలయం... అదే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ. వర్సిటీ నమూనాలో చూపిన విధంగా వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రత్యేక పర్యవేక్షణలో విజన్‌తో విద్యార్థులకు అవసరమైన క్రీడామైనాలను సిద్ధం చేశారు. ఈ పర్యా యం నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యూకేషన్ సెట్‌య(టీఎస్‌పీయూసెట్-2019) బాధ్యతలను ఉన్నత విద్యామండలి ఎంజీయూకు అప్పగించింది. కాగా ఆ సెట్ చైర్మన్‌గా మన వీసీని నియమించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీయూకు ఆ సెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు రానున్నారు. అయితే దీన్నిలో భాగంగా రాష్ట్రస్ధాయిలో మరోగుర్తింపు దక్కనుండటంతో సర్వ త్రా హర్ష వ్యక్తం మవుతుంది. గ్రామీణ విద్యార్థులకు సహితం ఉన్న విద్యను దగ్గరికిచేర్చే విధంగా నల్లగొండ 2007-08లో మహాత్మాగాం ధీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అదేస్ధాయిలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆధునిక టెక్నాలజీతో విద్యార్థులకు క్రీడామైదానలు నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్. యూనివర్సిటీలో పలికి ప్రవేశించే ప్రధాన మార్గం కుడివైపు అన్ని మైదానలు అందుబాటులోకి తెచ్చారు.

అందుబాటులో ఉన్న మైదానాలు ఇవే....
ఎంజీయు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే దారి లో కుడి వైపున యూనివర్సిటీ నమూనాలో చూపిన విధంగా సైన్స్ బ్లాక్ సమీపంలో క్రీడా మైదానాలు నిర్మించారు. వీటిలో ఖోఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్, మల్టీ పర్పస్‌లో క్రికెట్, పుట్‌బాట్, వాకింగ్ ట్రాక్‌లున్నాయి. అదే విధంగా క్రీడా మైదానాలనుకలుపుతూ ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అదే విధంగా ఇండోర్ స్టేడియం పనులు శరవేగం జరుగుతున్నాయి.

పీయూ సెట్ -2019 మహాత్మాలోనే ....
తెలంగాణ వ్యాప్తంగా 2019-20లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌పీయూ సెట్ -2019 నిర్వహణ బాధ్యతను మహాత్మాగాంధీ యూనివర్సిటికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అప్పగించింది. అయితే దాని నిర్వహణకు అవసరమైన క్రీడా మైదానాలు పూర్తిస్థాయిలో ఎంజీయూలో ఉండటంతోనే అ బాధ్యతను అప్పగించారు. ఈ సెట్ తెలంగాణలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నప్పటికి ఈ బాధ్యత ఎంజీయుకు అప్పగించడంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఎంజీయూకు క్రీడల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. అంతేకాకుండా ఆసెట్ చైర్మన్‌గా ఎంజీయూవీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వ్యహరించనున్నారు.


పీయూసెట్‌ను విజయవంతంగా నిర్వహిస్తాం
పీయుసెట్ -2019 నిర్వహణ బాధ్యతలను ఎంజీయుకు అప్పగించారు. దీం తో దాన్ని విజయవంతంగా నిర్వహిం చి తెలంగాణలోనే మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గు ర్తింపు తెచ్చే విధం గా క్రీడా మైదానాలను ఇప్పటీకే సిద్ధం చేశాం. యూ నివర్సిటీ మాస్టర్‌ప్లాన్‌లో సూచించిన ప్రాంతంలోనే సుందరంగా క్రీడామైదానాలను ఆయా విభాగాల నిపుణుల సూచనల మేరకు నిర్మించి ఈ విద్యాసంవత్సరం ఎం జీయూ ఐసీటీ, ఐయూటీ పోటీలు నిర్వహించాం. ఏదేమైనా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా అన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మరో వైపు ఇప్పటికే ఇం జినీరింగ్ కళాశాల, సీఓఈ భవనలు, వీసీ, స్టాప్ క్వా టర్స్, ఇం డోర్ స్టేడియం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాల,బాలిక హస్టల్ నిర్మాణాల పనులు సాగుతున్నా యి. రానున్న కాలంలో ఎంజీయూను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనేది లక్ష్యం.
-ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వీసీ

266
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...