కొనసాగుతున్న కంటి వెలుగు


Thu,January 17, 2019 02:25 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో 92 వ రోజు బుధవారం జరిగిన కంటి వైద్య పరీక్షల్లో పాల్గొన్న ప్రజలు నేత్రానందం పోందారు. జిల్లాలో ఎక్కువగా మహిళలు పెద్ద ఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్కువగా వృద్దులు వైద్య పరీక్షలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 37 వైద్య బృందాలు బుధవారం 6148 మందికి పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటివరకు 590340 మందికి రోగులకు వైద్య బృందం సభ్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానిక ప్రజాప్రతనిధులు పలువురికి కళ్లద్దాలను అందజేశారు. స్ధానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వైద్య పరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి ఆద్దాలను, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 32 చోట్లా, పట్టణ ప్రాంతాల్లో 5 చోట్లవైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 590340 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 2951 (ఇప్పటి వరకు 275545 ) మంది పురుషులు, 3197 (ఇప్పటి వరకు 313010 ) మంది స్త్రీలు, 35మంది ఇతరులు పాల్గొనగా 445 (ఇప్పటి వరకు 101329 ) మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కంటి ఆద్దాలు అందజేశారు. మరో 416 (ఇప్పటి వరకు 45452 ) మంది రెండు కండ్లల్లో రెండు రకాల చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూడు వారాల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర అసుపత్రికి 475 (ఇప్పటి వరకు 39584 )మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. ఈరోజు జరిగిన పరీక్షలో 4695 ఇప్పటి వరకు (361374 ) మందికి ఏలాంటి సమస్యలు లేవని గుర్తించారు. ఈకార్యక్రమాల్లో మెడికల్ అఫీసర్‌లు, క్యాంపు మెడికల్ అఫీసర్‌లు, క్యాంపు కోఅర్డినేటర్‌లు, అఫ్తాలిస్టులు ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...