క్రీడల్లో రాణించిన వారికి భవిష్యత్తు


Mon,January 14, 2019 03:33 AM

-ప్రభుత్వ సలహాదారుడు వివేకానంద
-రాష్ట్రస్థాయి సబ్ వాలీబాల్ పోటీల్లో 2, 4 స్థానాల్లో నల్లగొండ బాలికల, బాలుర జట్లు
మంచిర్యాల స్పోర్ట్స్: క్రీడల్లో రాణించిన వారికి ప్రత్యేక గుర్తింపుతోపాటు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకశాలుంటాయని ప్రభుత్వ సలహదారుడు గడ్డం వివేకానంద అన్నారు. అదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి సబ్ వాలీబాల్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో రాణిస్తేనే భవిష్యత్ బాగుంటదని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. అనంతరం బహుమతులు అందజేశారు. బాలురలో హైదరబాద్ జట్టు మొదటిస్థానం, వరంగల్ జట్టు రెండోస్థానం, ఆదిలాబాద్ జట్టు మూడో స్థానం, నల్గొండ జట్టు నాలుగో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో వరంగల్ జట్టు మొదటిస్థానం, నల్గొండ జట్టు రెండో స్థానం, నిజమబాద్ జట్టు మూడోస్థానం, రంగారెడ్డి జట్టు నాలుగోస్థానం సాదించాయి. మొదటిస్థానం సాధించిన జట్లకు పదిహేను వేల రూపాయల నగదుతోపాటు ట్రోఫీ మెడల్స్, రెండోస్థానం సాధించిన జట్లకు పదివేలతోపాటు ట్రోపీ, మెడల్స్, మూడు, నాలుగోస్థానం సాధించిన జట్లకు ట్రోపీతోపాటు ఐదువేల నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి రఘునాథ్ ఎమ్మెల్యే దివాకర్ తనయుడు విజిత్,శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ నాయకుడు సురేందర్ పరీశీలకుడు మోహన్ వాలిబాల్ సంఘం పరిశీలకుడు సుధిర్ ప్రజలు పాల్గొన్నారు.

300
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...