ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గిస్తాం


Mon,January 14, 2019 03:33 AM

-పరిమితికి మించి ఖర్చు చేస్తే అభ్యర్థుల ఎన్నిక రద్దు
-వేలంపాటతో ఏకగ్రీవం చేస్తే జైలుశిక్ష
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
-సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఎన్నికల్లో నగదు ప్రవాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ అతిథి గృహంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేకాధికారి చిరంజీవులు, కలెక్టర్ అమయ్ వివరాలు అడిగి తెలుసకున్నారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్పం చ్, వార్డుల అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు చేయాలన్నారు. ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే ఎన్నిక రద్దు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై ఎంపీడీఓలు దృష్టి సారించాలన్నారు. ఏకగీవ్రాల పేరుతో గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తే అభ్యర్థి ఎంపిక రద్దు చేసి ఏడాది జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. కౌంటింగ్ ఆలస్యమయ్యే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఎన్నికల పరిశీలకుడు చిరంజీవులు మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం సూర్యాపేట కలెక్టర్ అమయ్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో అధికారులు అలసత్వం వహించినట్లు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్ అమయ్ జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, డీఆర్వో చంద్రయ్య, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు మోహన్ కిషోర్ డీపీఓ రామ్మోహన్ వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
26 నుంచి సైన్స్ ప్రదర్శన పోటీలు : డీఈఓ
రామగిరి : జిల్లాస్థాయి మానక్ ఇన్ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఈ నెల 26 నుంచి 28వరకు నల్లగొండలోని డాన్ హైస్కూల్ నిర్వహించనున్నట్లు డీఈఓ పి. సరోజినీదేవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2017-18, 2018-19 విద్యాసంవత్సరంలో ప్రదర్శనకు ఎంపికైన 446ప్రాజెక్టుల విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శనకు కచ్చితంగా హాజరుకావాలని సూచించారు. ప్రతీ ప్రదర్శన వర్కింగ్ మోడల్స్ ఉండాలని సూచించారు. ఎంఈఓలతో ధ్రువీకరణ పూర్తి చేయించుకుని ఈ నెల 26 ఉదయం 10గంటలలోపు ప్రదర్శనకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సెల్ నెంబర్ 9848578845 సంప్రదించాలని ఆమె సూచించారు.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...