యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద


Sun,January 13, 2019 02:15 AM

-భారత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి
-వివేకానంద జయంతిలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
-పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, అధికారులు
నల్లగొండ కల్చరల్ : చిరుప్రాయంలోనే భారత ఔనత్యన్ని ప్రపంచ దేశాల్లో కీర్తిగాంచిన మహానీయుడు స్వామి వివేకానందుడని.. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ తెలిపారు. స్వామి వివేకనంద 156వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులోగల వివేకనంద విగ్రహాం వద్ద జిల్లా క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖ, టీపీయూఎస్ ఆధ్వర్యంలో శనివారం యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ డీఈఓ పి.సరోజనీదేవితో కలిసి కలెక్టర్ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు అక్కడే ఉన్న వివేకనంద విగ్రహానికి అధికారులు, ప్రముఖులు, పట్టణ వాసులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అతిచిన్నవస్సులోనే ప్రపంచానికి దేశ ఔనత్యంచాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడన్నారు.

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ మాట్లాడుతూ స్వామివివేకానంద ఎందరికో స్ఫూర్తినీయమని పేర్కొన్నారు. డీఈఓ సరోజనీదేవి మాట్లాడుతూ వివేకానందన జీవిత చరిత్రను పాఠ్యంశాలలో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం చిన్నారులు వివేకానందుడి వేశాధారణలో ఆకట్టుకున్నారు. టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు అల్గుపల్లి పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆర్డీఓ జగీశ్వర్ ట్రెజరీ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయ్ వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి యడమ మాధవరెడ్డి, జిల్లా యువజ సర్వీసులు, క్రీడాలశాఖ అధికారి మక్భుల్ ఆ శాఖ మేనేజర్ ధనంజయ్, టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ నాయకులు టి.సాయిరెడ్డి, తెలకపల్లి పెంటయ్య, వీరేల్లి చంద్రశేఖర్, గార్లపాటి వెంకటయ్య, ఎ.అంజిరెడ్డి, రావుల శ్రీనివాస్ అబ్బగోని రమేష్ వెంకన్న, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...