పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి


Sun,January 13, 2019 02:09 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21, 25, 30వ తేదీలో జరగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులను గెలిపించి మరోసారి సత్తా చాటాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్మే కంచర్ల భూపాల్ నివాసంలో పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం తొలి సర్కార్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినట్లు వివరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాల దిమ్మదిరిగిందన్నారు. నల్లగొండ నియోజక వర్గంలో అన్ని సర్పంచ్ స్థ్దానాలు టీఆర్ గెలుచేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు గత ఎన్నికల్లాగానే సమన్వయంతో పని చేసి విజయం సాధించాలని అన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ మాట్లాడుతూ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి టీఆర్ అభ్యర్థులు గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్దులు గెలిస్తేనే రేపు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తి స్దాయిలో వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పని చేసే ప్రతి కార్యకర్తకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించేవిధంగా చూస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాష, పల్ రవీందర్ లొడంగి గోవర్ధన్, బషీరొద్దీన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...