పశు గణనలో పెరిగిన వేగం


Sat,January 12, 2019 02:55 AM

-గతేడాది అక్టోబర్ 2 నుంచి పాడి పశువులను లెక్కిస్తున్న అధికారులు
-జిల్లాలో 4.07లక్షల ఇళ్లకు గాను 2.01లక్షల ఇళ్లల్లో గణన పూర్తి
-దేశ వ్యాప్తంగా ఐదేళ్లకోసారి పశుగణనచేపడుతున్న కేంద్రం
-103 మంది ఎన్యుమరేటర్లు.. 35 మంది సూపర్ గణన
-రైతు ఇంటి ముందే ఆన్ అప్ చేస్తున్న సిబ్బంది
నల్లగొండ, నమస్తే తెలంగాణ: కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఐదేళ్లకోసారి పశుగణన చేపడుతుంది. అం దులో భాగంగానే జిల్లాలో అక్టోబర్ 2న పశు సంవర్థ్ధక శాఖ పశుగణన చేపట్టింది. 1919లో తొలిసారిగా దేశం లో పశుగణన ప్రారంభమై ఇప్పటివరకు 19సార్లు చేపట్టారు. ఇప్పటికే 19సార్లు పశుగణన చేపట్టగా 20వ సారి ప్రస్తుతం కొనసాగుతోంది. గతేడాది చివరలో ఈ గణన చేపట్టాలని పశుసంవర్థక శాఖ అధికారులను కేం ద్ర సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఆ శాఖాధికారులు ఏర్పాట్లు చేసి ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 4,500 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్ ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో కోళ్ల నుంచి గుర్రాల వరకు ఉన్నటువంటి జీవాలు లెక్కిస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 4.01 లక్షల ఇండ్లు ఉండగా సకల జనుల సర్వే తర్వాత 4.07 లక్షల ఇండ్లకు పెరిగింది. అం దులో 2.01లక్షల ఇళ్లలో పాడి పశువులను ఇప్పటి వరకు లెక్కించారు. అయితే వీటిని ఎప్పటికప్పుడు సర్కార్ ఇచ్చినటువంటి ట్యాబ్ సూచించిన వెబ్ అప్ చేస్తున్నారు.

2.01 లక్షల ఇళ్లలో పూర్తయిన పశుగణన
జిల్లావ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ యంత్రాంగం అక్టోబర్ 2న పశుగణన ప్రారంభించి ఇంటింటికి పాడి పశువులను లెక్కిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 4.01 లక్షల ఇండ్లు ఉండగా సకల జనుల సర్వే తర్వాత 4.07 లక్షల ఇండ్లకు పెరిగింది. అందులో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.01 లక్షల ఇళ్లలో పశు గణన పూర్తి చేసిన పశు సంవర్థ్ధక శాఖ సిబ్బంది ఏ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 2012-2013 సంవత్సరంలో అఖిల భారత పశుగణ న చేపట్టగా మళ్లీ ఐదేళ్ల తర్వాత లెక్కిస్తున్నారు. అప్పటి లెక్కల ప్రకారం మొత్తం తెల్ల పశువులు 2.8 లక్షలు ఉండగా గేదెలు 2.99 లక్షలు, గొర్రెలు 8.8 లక్షలు, మేకలు 2.88 లక్షలు, కోళ్లు 25.28 లక్షలు, కుక్కలు 28 వేలు ఉన్నాయి. అయితే ఆదేళ్ల తర్వాత మళ్లీ పశుగణన తాజాగా జరుగుతుండటంతో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు 2.01 లక్షల ఇళ్లలో గణన చేయగా 60,500 పశువులు1.35 లక్షల గేదెలు, నాలుగు లక్షల గొర్రెలు, 1.15 లక్షల మేకలు, 2000 పందులు, 3.5 లక్షల పెరటి కోళ్లు ఉన్నట్లు తేలింది.

గణనలో 103 మంది ఎన్యుమరేటర్లు
జిల్లావ్యాప్తంగా 103 మంది ఎన్యుమరేటర్లతో గ్రామీ ణ ప్రాంతాల్లో 4,500 ఇళ్ల చొప్పున, పట్టణ ప్రాం తాల్లో 6 వేల ఇళ్ల చొప్పున గణిస్తున్నారు. ముగ్గురి ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ చొప్పున మొత్తం 35 మంది ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గణన పూర్తయిన తర్వాత వారికి ప్రభుత్వం ఇంటికి రూ.5 చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వనుంది.ఈ పశుగణన కోసం ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం ట్యాబ్ అందజేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడే ఆ వివరాలను www.quinoquial census of life అనే వెబ్ అప్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 2న ప్రారంభించిన పశుగణన తొలుత డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని యోచనతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే సాఫ్ట్ సమస్య కారణంగా గణన ఆల స్యం కావటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడు వు పెంచారు. సాఫ్ట్ సైతం 2.1 వర్షన్ నుంచి 2.2 కి ఆ తర్వాత 3.1కి అప్ అయింది. ఈ నేపధ్యంలో ఆన్ నమోదులో వేగం పెరగడం వల్ల గడువు లోపల గణన పూర్తి చేసే లా పశు సంవర్థ్దక శాఖ యంత్రాంగ చర్యలు తీసుకుంటుంది.

కోడి పిల్లలతో సహా....
పశుగణనలో భాగంగా కేంద్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు పశు సంవర్థ్ధక శాఖ సిబ్బంది ప్రతి ఇంట్లోను ఉన్నటువంటి జీవాలను లెక్కిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇరవయ్యవ దఫా జరుగుతున్న ఈ గణనలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శిస్తున్నటువంటి ఎన్యుమరేటర్లు ఆ ఇంట్లో ఉన్నటువంటి జీవాల లెక్కను తీస్తున్నారు. అఖిల భారత పశుగణన ఆధ్వర్యంలో పశువులతోపాటు వాటి యజమానులు, వారి ఆదాయం, విద్యార్హత, మాంసం దుకాణాలు, కోళ్లఫారాల సంఖ్యపైన ఆరా తీసి లెక్కిస్తున్నా రు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలతోపాటు కుక్క లు, గాడిదలు, గుర్రాలు, పందులు, టర్కీ కోళ్లు, ఒం టెలు, బాతులు....అంటే ఏ యజమాని అయినా తన ఇంట్లో పెంచుకునేటువంటి ప్రతి జీవి లెక్క ఇక రికార్డుల్లోకి తీసుకుని ఎప్పటికప్పుడు వారికి ఇచ్చిన ట్యాబ్ అప్ చేస్తు ఆన్ పొందు పరుస్తున్నా రు. పూర్తిస్థాయిలో సేకరించిన ఈ వివరాలను ఏ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసేలా చర్యలు
జిల్లాలో ఈ ఏడాది అక్టోబ ర్ 2 నుంచి ప్రతిరోజు 103 మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటా పశుగణన చేప ట్టాం. ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి పాడి పశువులను లెక్కించడంతోపాటు వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ అప్ చేస్తున్నారు. ప్రభుత్వం గడువును డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు పెం చింది. అప్పటి వరకు లెక్కింపు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం.
-శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్థక శాఖ ఇన్ అధికారి, నల్లగొండ

504
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...