‘పెద్దగట్టు’ జాతరకు ఏర్పాట్లు చేయాలి


Sat,January 12, 2019 02:52 AM

-జాతర పనులపై కలెక్టర్, అధికారులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ సమీక్ష
-భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
సూర్యాపేట, నమస్తేతెలంగాణ : వచ్చే నెల 24నుంచి 28వరకు ఐదురోజుల పాటు నిర్వహించనున్న పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కలెక్టర్ అమయ్ కలిసి జాతర పనుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 10న దిష్టిపూజ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి వాటికి నల్లాలు బిగించి ఎప్పటికప్పుడు నీటి సరఫరా అందేలా చూడాలని చెప్పారు. భద్రతకు సాంకేతికను ఉపయోగించుకోవాలని సూచించారు. జాతర ప్రాంగణాన్ని 8జోన్లుగా విభజించి 20మంది పంచాయతీ సెక్రెటరీలను నియమించాలన్నారు. ఒక్కో జోన్ ముగ్గురు చొప్పున పంచాయతీ సెక్రెటరీలను నియమించి ఎప్పటి కప్పుడు పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జాతరలో సేకరించిన చెత్త, ఇతర వస్తువులను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి.అమయ్ మాట్లాడుతూ గతంలో మంజూరు చేసిన పనులను నేటి వరకు పూర్తి చేయకపోవడంపై సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, డీఆర్వో పి.చంద్రయ్య, డీఎస్పీ నాగేశ్వర్ ఆర్డీఓ మోహన్ ఈఈ ఆర్ యాకుబ్, సీపీఓ అశోక్ మున్సిపల్ కమిషనర్ శంకర్, డీపీఓ రామ్మోహన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు భాషా, యాదవ సంఘం నాయకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

305
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...