రెండో విడతకు సిద్ధం


Fri,January 11, 2019 01:25 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మిర్యాలగూడ, మాడ్గులపల్లి, వేములపల్లి, పెద్దవూర, నిడమనూరు, దామరచర్ల, అడవిదేవులపల్లి, అనుముల, తిరుమలగిరి సాగర్, త్రిపురారం మండలాల పరిధిలోని 276 సర్పంచ్, 2376 వార్డులకు రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికలను స్టేజ్1, స్టేజ్-2 అధికారుల ఆధ్వర్యం లో నిర్వహించనున్నారు. స్టేజ్-1లో రిటర్నింగ్, సహా య రిటర్నింగ్ అధికారులు ఉండగా... స్టేజ్-2లో పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి, ఊపసర్పంచి ఎన్నికలను సైతం స్టేజ్-2 అధికారులు పూర్తి చేస్తారు.

నామినేషన్ల దాఖలుకు 83క్లస్టర్ కేంద్రాలు
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో జరిగే రెండో విడు త ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి డివిజన్ వ్యాప్తంగా 83 క్లస్టర్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సున్నిత, అతి సున్నిత పోలింగు కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణతో పాటు పోలింగు కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు.

10మండలాలకు.. 10మంది ప్రత్యేకాధికారులు
డివిజన్ పరిధిలో ప్రతీ మండలంలో పర్యవేక్షణ కోసం ప్రతేకాధికారిని నియమించారు. 10మండలాల కు 10మంది ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండనున్నారు. ఎన్నికల సామగ్రి తరలింపు, సిబ్బంది పోలింగ్ కేంద్రాల రాకపోకలు సాగించేందుకు వాహనాల ఏర్పాటుతోపాటు డివిజన్, మండల, గ్రామస్థాయి నుంచి అధికారులను సమన్వయం చేయనున్నారు. ఎన్నికల నియమావళి అమలుతోపాటు అభ్యర్థ్ధుల వ్యయ పరిశీలన సైతం ప్రత్యేకాధికారులు చేయనున్నారు.

మండలస్థాయిలో నిఘా బృందాలు
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో వ్యయ పరిశీలక, సర్వైలైన్స్, స్టాటిస్టిక్స్, వీడియో చిత్రీకరణ బృందం, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో నలుగురు అధికారులను నియమించారు. ఎన్నికల నియమావలి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి.

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డివిజన్ పరిధిలోని 10 మండలాల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యా యి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు డివిజన్ పరిధిలో 83 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. డివిజన్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పంచాయతీ ఎన్నికలనూ అదే రితీలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
- జగన్నాథరావు, ఆర్డీఓ, మిర్యాలగూడ

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...