హోరాహోరీగా..


Fri,January 11, 2019 01:23 AM

భువనగిరి ఖిల్లా: గెలుపే లక్ష్యంగా క్రీడల్లో పాల్గొనాల ని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 52వ సీనియర్ రాష్ట్రస్థా యి ఖోఖో పోటీలను ప్రారంభించి ఆమె మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలలకు గుర్తింపు తీసుకురావాల న్నారు. ప్రభుత్వం క్రీడలకు సముచిత ప్రాధాన్యతని స్తోందన్నారు. డీసీపీ రామచంద్రారెడ్డి మా ట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రథమ స్థానం లో నిలువాలన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడాపతాకాన్ని కలెకర్ట్ నితారామచంద్రన్, జిల్లా పతాకాన్ని డీవైఎస్‌ఏ వెంకటరంగయ్య ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థులు పలుగురాళ్ళ గడ్డమీద ఉయ్యాలో..పడిలేచినవమ్మో ఉయ్యాలో, భువనగిరి ఖిల్లా మీద బోనాల ఆట ప్రదర్శ న, ఇండియా మిషన్ హైస్కూల్ విద్యార్థుల (10జిల్లాల చారిత్రక నేపథ్యం)డ్యాన్స్ అహుతులను ఆకట్టుకన్నాయి.

ఆసక్తికరంగా కొనసాగిన పోటీలు
52వ సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో చాంఫియన్ షిప్ పోటీల్లో మొదటిరోజు నిర్వహించిన లీగ్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా కొనసాగాయి. మహిళా విభాగంలో ఉమ్మడి నల్లగొండ జట్టు ఖమ్మం జట్ల మధ్య జరిగిన పోటీలో నల్లగొండ జట్టు విజయం సాధించింది. ఖమ్మం జిల్లా జట్టుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు చుక్కలు చూపించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు 14 పాయింట్లు సాధించగా, ఖమ్మం 2 పాయింట్లు సాధించి చతికిలబడింది. హైదరాబాద్ మెదక్ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. హైద్రాబాద్ జిల్లా జట్టు 7 పాయింట్లు సాధించగా మెదక్ జిల్లా జట్టు 5 పా యింటు సాధించింది. దీంతో 2 పాయింట్లతో హైద్రాబాద్ జట్టు విజయం సాధించిం ది. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి జిల్లా జట్టు 6 పాయింట్లు సాధించగా నిజామాబాద్ జిల్లా జట్టు 4 పాయింట్లు సాధించింది. దీంతో 2 పాయింట్లతో రంగారెడి ్డజిల్లా జట్టు విజయం సాధించింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య జరిగిన పోటీలో కరీంనగర్ జట్టు 12 పాయింట్లు సాధించగా ఆదిలాబాద్ జిల్లా జట్టు 2 పాయింట్లు సాధించి చతికిలపడింది. అదేవిధంగా బాలుర విభాగంలో వరంగల్, నల్లగొండ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలో వరంగల్‌జిల్లా జట్టు 12 పా యింట్లు సాధించగా నల్లగొండ జిల్లా జట్టు 8 పాయిం ట్లు సాధించింది.

దీంతో 4 పాయింట్ల తేడాతో వరంగల్ జట్టు విజయం సాధించింది. కరీంనగర్, హైద్రాబాద్ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీల్లో కరీంనగర్ 18 పాయింట్లు సాధించగా హైద్రాబాద్‌జిల్లా జట్టు 12 పాయింట్లు సాధించింది. దీంతో 4 పాయింట్ల తేడాతో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. రంగారెడ్డి మెదక్ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి జట్టు 9 పాయింట్లు సాధించగా మెదక్ జట్టు కేవలం 2 పాయింట్లు సాధించి చతికిల పడింది. నిజామాబా ద్, మెదక్ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీల్లో రెండు జట్లు హోరాహొరీగా తలపడ్డాయి. నిజామాబాద్ జట్టు 9 పాయింట్లు సాధించగా మెదక్ జిల్లా జట్టు 8 పా యింట్లు సాధించింది, దీంతో కేవలం 1 పాయింట్ తో నిజామాబాద్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రసిడెంట్ ఈశ్వర్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రసిడెంట్ వెంకటనారాయణ గౌడ్, జనరల్ సెక్రెటరీ నాతి కృష్ణమూర్తి, రామకృష్ణ, సాగర్‌రెడ్డి, శ్యాంప్రసాద్, ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, శ్రీరాములు తదిత రులు పాల్గొన్నారు.

301
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...