నాడు ఒక్కటి.. నేడు తొమ్మిది


Thu,January 10, 2019 02:01 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొత్త జిల్లాలు.. కొత్త మండలాలతోపాటు గ్రామ పంచాయతీల పునర్విభజనతో నూతన పంచాయతీలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంతో నేడు చిన్న చిన్న తండాలు, పల్లెల్లోనూ స్వయం పాలన చేరువవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందడితో నూతనంగా ఏర్పాటైన పంచాయతీల్లో గతంలో ఎన్నడూ లేనంత సందడి నెలకొంది. జిల్లాలో మొత్తం 349పంచాయతీలు నూతనంగా ఏర్పాటయ్యాయి. 100శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాలు మొత్తం 104ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మొత్తం 844పంచాయతీలతో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో పంచాయతీలు ఉన్న జిల్లాగా నల్లగొండ మొదటి స్థానంలో ఉంది. అయితే కొత్తగా ఏర్పాటైన అనేక పంచాయతీలు గతంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దగా ఉన్న పలు పాత పంచాయతీల నుంచి మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పాటైనవి ఉన్నాయి.
కొత్త పంచాయతీలతో చేరువ కానున్న పాలన...
గతంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దగా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ పర్యవేక్షణ సరైన రీతిలో జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పంచాయతీల పరిధి తగ్గి నూతనంగా ఏర్పాటైనందున.. స్థానికులే సర్పంచ్ ఎన్నిక కానున్నారు. దీంతో వారికి ఆయా గ్రామాల్లోని ప్రతి సమస్యపైనా పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం ఖాయం. దీనికితోడు చిన్న చిన్న గ్రామాలు, తండాలు ఏకతాటిపై నడుస్తూ ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకుంటున్నాయి. ఐక్యంగా సాగుతున్న పల్లెల్లో మరింత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10లక్షలు నిధులు కేటాయిస్తుండడం.. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రోత్సహిస్తుండటం పల్లెల అభివృద్ధికి ఉపకరించనుంది.
ఎక్కువ సంఖ్యలో ఏర్పాటైన పంచాయతీలు కొన్ని...
నల్లగొండ నియోజకవర్గంలోనే తిప్పర్తి మండలంలోని రాజుపేట అతిపెద్ద గ్రామ పంచాయతీ. 4206 జనాభా ఇక్కడ ఉండేది. వీరంతా ఒకే గ్రామ పంచాయతీ పరిధిగా గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. ప్రస్తుతం రాజుపేట నుంచి జొన్నగడ్డలగూడెం, కాశివారిగూడెం, గంగన్నపాలెం పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు రాజుపేటలో 1261ఓట్లు ఉండగా.. జొన్నగడ్డలగూడెంలో 1011, కాశివారిగూడెంలో 493, గంగన్నపాలెంలో 546 ఓట్లున్నాయి.
-చందంపేట మండలం పోలేపల్లి నుంచి నాలుగు పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. గుంటిపల్లి (320 ఓట్లు), మునావత్ తండా(420 ఓట్లు), గన్నెర్లపల్లి(450 ఓట్లు), బిల్డింగ్ తండా(380) కొత్త పంచాయతీలుగా ఏర్పాటు కాగా.. ప్రస్తుతం పోలేపల్లి పంచాయతీలో 3200 ఓట్లు ఉన్నాయి.

-కొండమల్లేపల్లి మండలం చెన్నారం ఉమ్మడి పంచాయతీలో మొత్తం 1800ఓట్లు ఉండగా.. గన్యానాయక్ తండా(478 ఓట్లు), దంజిలాల్ తండా (280 ఓట్లు), ఆంబోతు తండా(349), గుర్రపు తండా (401) కొత్తగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం చెన్నారంలో 600 ఓట్లు ఉన్నాయి.
-పీఏపల్లి మండలంలోని వద్దిపట్ల ఉమ్మడి పంచాయతీ నుంచి పుట్టంగండి(300 ఓట్లు), చింతల్ తండా(700 ఓట్లు), పడ్మటి తండా (700), పెద్ద గుమ్మడం (400), వద్దిపట్ల (1300) ఓట్లతో మొత్తం 5 పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి.
-దామరచర్ల మండల పరిధిలోని కేశవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 6నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. పాత కేశవాపురం పంచాయతీలో మొత్తం జనాభా 4543 ఉండగా 3356 ఓట్లున్నాయి. కేశవాపురంలో జనాభా 1728 ఉండగా (1454 ఓట్లు), మంగలదుబ్బతండాలో జనాభా 520 ఉండగా (410 ఓట్లు), బండావల్ తండాలో జనాభా 420 ఉండగా (305 ఓట్లు), లావురిబిక్యాతండాలో జనాభా 354 ఉండగా (209 ఓట్లు), నునావత్ తండాలో జనాభా 523 (423 ఓట్లు) ఉన్నాయి. జత్రా తండాలో జనాభా 687 (592 ఓట్లు) ఉన్నాయి. టక్కుంటలో జనాభా 524 (321 ఓట్లు) ఉన్నాయి.
-మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడ్ పంచాయతీలో మొత్తం జనాభా 6719 (ఓటర్లు 5200) ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఆరు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. శ్రీనివాసనగర్ జనాభా 1310 (919 ఓట్లు) ఉన్నాయి. లావుడితండాలో జనాభా 1245 ( 1069ఓట్లు) ఉన్నాయి. ధీరావత్ తండాలో జనాభా 440 (323ఒట్లు) ఉ్లన్నాయి. దుబ్బతండాలో జనాభా 890 (705 ఓట్లు) ఉన్నాయి. సౌమ్య తండాలో జనాభా 680 ( 524 ఒట్లు) ఉన్నాయి. తుంగపాడ్ జనాభా 2500 (1879 ఓట్లు) ఉన్నాయి.

-జప్తి వీరప్పగూడెం పాత గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం జనాభా 2628 (1890ఓట్లు) ఉన్నాయి. దీని పరిధిలో 4 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. జప్తివీరప్పగూడెంలో మొత్తం జనాభా1250 ( 925 ఓట్లు) ఉన్నాయి. బిల్యానాయక్ తండాలో మొత్తం జనాభా 350 (ఓటర్లు 216) ఉన్నారు. జటావత్ తండాలో మొత్తం జనాభా 475 (384 ఓట్లు) ఉన్నాయి. సీత్యాతండాలో మొత్తం జనాభా 688(453 ఓట్లు) ఉన్నాయి.
-మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ పాత గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం జనాభా 3485 (2380 ఓట్లు) ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 4 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. నారాయణపురంలో మొత్తం జనాభా 611 (446 ఓట్లు) ఉన్నాయి. కేశవాపురంలో మొత్తం జనాభా 517 ( 367 ఓట్లు) ఉన్నాయి. గారకుంటపాలెంలో మొత్తం జనాభా 965 (639 ఓట్లు) ఉన్నాయి. కన్నెకల్ మొత్తం జనాభా 1392 (957 ఓట్లు) ఉన్నాయి.
-నిడమనూరు మండలంలోని తుమ్మడం పాత గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం జనాభా 6756 (4778 ఓట్లు) ఉన్నాయి. దీని పరిధిలో నూతనంగా 3 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇండ్ల కోటయ్యగూడెంలో మొత్తం జనాభా 1440 (1118 ఓట్లు) ఉన్నాయి. వడ్డెరగూడెంలో మొత్తం జనాభా 864 (578 ఓట్లు) ఉన్నాయి. పార్వతిపురంలో మొత్తం జనాభా 581 (518 ఓట్లు) ఉన్నాయి.
-తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలోని చింతలపాలెం పాత గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా 5516 (4437 ఓట్లు) ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 6 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. నాగార్జునపేటలో మొత్తం జనాభా 968 (724 ఓట్లు) ఉన్నాయి. సపావత్ తండాలో మొత్తం జనాభా 721 (590 ఓట్లు) ఉన్నాయి. నాయకునితండాలో మొత్తం జనాభా 1208 (1082 ఓట్లు) ఉన్నాయి. బట్టువెంకన్నబాయితండాలో మొత్తం జనాభా 812 (621ఓట్లు) ఉన్నాయి. గోడుమడకలో మొత్తం జనాభా 802 (610 ఓట్లు) ఉన్నాయి. చింతలపాలెంలో మొత్తం జనాభా 1050 (888 ఓట్లు) ఉన్నాయి.
-మునుగోడు పాత గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా 10141 (7327ఓట్లు) ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 3 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. మునుగోడు ప్రస్తుత గ్రామ జనాభా 8186 (5871 ఓట్లు) ఉన్నాయి. రావిగూడెంలో మొత్తం జనాభా 1019 (728 ఓట్లు) ఉన్నాయి. జక్కలవారిగూడెంలో మొత్తం జనాభా 513 (371 ఓట్లు) ఉన్నాయి. గుండ్లోరిగూడెంలో మొత్తం జనాభా 423 (357 ఓట్లు) ఉన్నాయి.

232
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...