యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పరిశీలన


Tue,September 18, 2018 02:05 AM

-పరిశీలించిన వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈఓ ఎన్.గీతలు సోమవారం పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈఈ వసంతనాయక్, డిజైనర్ మధుసూదన్, స్తపతులు ఎస్.సుందరరాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలులతో కూడిన బృందం యాదాద్రికొండపైన జరుగుతున్న పనులను పరిశీలించింది. భక్తులు దర్శనానికి ఎలా రావాలి.. క్యూలైన్ల నిర్మాణం ఎలా జరగాలి వంటి వాటిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించారు. డిజైన్ల ప్రకారం ఏ యే నిర్మాణాలు ఎక్కడెక్కడ జరగాలనే దానిపై స్పష్టతకు వచ్చారు. రామానుజకూటమి పక్కన అర్చకుల వసతి, మౌళిక సదుపాయాలు, సౌండ్ సిస్టమ్ ఎలా ఉండాలి నిర్మాణం పనులు ఎలా చేస్తే వారికి ఉపయోగపడేవిధంగా ఉంటుందనే విషయంపైన వివరాలను ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల వెంకటాచార్యులు, స్ధానాచార్యులు ఆరుట్ల రాఘవాచార్యులకు వైటీడీఏ ఇంజినీర్లు వివరించారు. ఈ సందర్భంగా కిషన్‌రావు మాట్లాడుతూ భక్తులు సులువుగా దర్శనం చేసుకోవడానికి క్యూలైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

244
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...