24న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్


Tue,September 18, 2018 02:04 AM

రామగిరి : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ టెక్నాలజీ మ్యూజియం-బెంగళూరు ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లాస్థాయి సైన్స్‌సెమినార్ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.సరోజినీదేవి, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ వనం లక్ష్మీపతి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు నల్లగొండలోని డైట్ కళాశాలలో ప్రారంభమయ్యే సెమినార్‌కు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులు, ఒక గైడ్ టీచర్ హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9848578845ను సంప్రదించాలని కోరారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...