పోలీస్ గ్రీవెన్స్‌డేతో బాధితులకు భరోసా : ఏఎస్పీ


Tue,September 18, 2018 02:04 AM

నల్లగొండక్రైం : పోలీస్ గ్రీవెన్స్‌డేతో బాధితులకు భరోసా కల్పించనున్నట్లు ఏఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ పని చేస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులకు న్యాయం జరుగకపోతే అవి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...