అదే జోరు..


Mon,September 17, 2018 02:26 AM

- ఉత్సాహంగా సాగుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం
- కేతేపల్లిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వేముల వీరేశం
- మర్రిగూడెంలో కార్యకర్తలతో కూసుకుంట్ల సమావేశం
- పులిమామిడిలో ప్రచారం నిర్వహించిన నర్సింహయ్య
- కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో కనగల్ నుంచి చేరికలు
- పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ సేన
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముందస్తు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు అంతకంటే ముందున్నారు. కొన్ని సందర్భాల్లో పైకి హడావిడి కనిపించకుండా.. చాప కింద నీరులా కాలనీల వారీగా ముఖ్య నేతలను కలిసి మద్దతు కూడగడుతుండగా.. మరోవైపు నుంచి ఉత్సాహంగా బహిరంగ ప్రచారం నిర్వహిస్తున్నారు. నకిరేకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశంకు ఘన స్వాగతం పలుకుతూ కేతేపల్లి మండలం కేంద్రంలో కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మర్రిగూడెం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అనుముల మండలం పులిమామిడిలో ప్రచారం నిర్వహించారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండ మండలం చర్లాపల్లికి చెందిన 100 మంది కార్యకర్తలను గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. మిగిలిన అభ్యర్థులు కూడా తమ తమ శ్రేణులను సమాయత్తం చేస్తూ.. ఓటర్లను ప్రభావితం చేయగల ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

284
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...