జై టీఆర్‌ఎస్...


Sun,September 16, 2018 02:29 AM

- వాడవాడలా ఉద్యమ పార్టీకి వెల్లువెత్తుతున్న ప్రజామద్దతు
- ఉద్యమ అధినేత కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టాలని తీర్మానాలు
- నల్లగొండలో టీఆర్‌ఎస్ గెలుపునకు ఏకతాటిపైకి ఉద్యమకారులు
- నకిరేకల్‌లో వీరేశం విజయం కోరుతూ ఇస్లాంపూర్ ప్రతిజ్ఞ
- కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ కోదాడలో భారీ ప్రదర్శన
- రోజు రోజుకూ గులాబీ సేనకు మరింత పెరుగుతున్న జనబలం
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :
ఎక్కడ చూసినా జనమే జనం.. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజా బలం.. మరోసారి రాష్ట్రంలో కారు జోరును చాటేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నడుం బిగించిందా అన్నట్లు.. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల మద్దతు పెల్లుబికుతోంది. ప్రతిపక్షాలు కనుమరుగు కావడం ఖాయమన్న చందాన.. వీధులు, పల్లెలు, పట్టణాలు.. ప్రతి చోటా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామంటూ తీర్మానాలు జరుగుతున్నాయి. శనివారం ఈ ప్రజా ఉత్సాహం ప్రతి చోటా పోటెత్తింది. ఉద్యమ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కోదాడలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లగొండలో ఉద్యమకారులు టీఆర్‌ఎస్ గెలుపే తమ లక్ష్యమని తీర్మానం చేశారు. కేసీఆర్ ప్రకటించిన భూపాల్‌రెడ్డిని గెలిపించి ఉద్యమకారుల సత్తా చాటుతామని చెప్పారు. నకిరేకల్ మండలం ఇస్లాంపూర్ వాసులు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రోజు రోజుకూ మరింత పెరుగుతున్న టీఆర్‌ఎస్ ప్రజాబలం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటే.. ప్రతిపక్షాల గుండెల్లో మాత్రం గుబులును పెంచుతోంది.

నల్లగొండ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయమే మా అందరి లక్ష్యం.. ఉద్యమ పార్టీ గెలుపు కోసమే ఉద్యమకారులం అయిన మేమందరం కృషి చేస్తాం.. శనివారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్స్‌లో సమావేశమైన నియోజకవర్గ ఉద్యమకారులు చేసిన తీర్మానం ఇది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం పలుచోట్ల ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ గెలుపు కోసం తీర్మానాలు, ప్రతిజ్ఞలు, విజయం కోరుతూ స్వాగత ప్రదర్శనలు జరుగుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే అభ్యర్థులను సైతం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఉత్సాహంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోసారి టీఆర్‌ఎస్‌ను ఘనంగా గెలిపించి.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా అంతటా అంతే ఉత్సాహంగా ప్రజానీకం మద్దతు పలుకుతోంది. 12స్థానాలకు 10మంది అభ్యర్థులను ప్రకటించగా.. వాళ్లందరికీ ఆయా స్థానాల్లో ఇప్పటికే అపూర్వ స్వాగతాలు పలికిన జిల్లా వాసులు.. గెలుపు గుర్రాలకు మద్దతు ప్రకటిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు పోటెత్తుతున్న ప్రజా మద్దతు..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి రోజు నుంచీ కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతలు, సీనియర్ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో నల్లగొండ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్ పీఠం అధిరోహించడమే తమ ఏకైక ఆశయంగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రతిన బూనారు. కంచర్ల భూపాల్‌రెడ్డిని గెలిపించి టీఆర్‌ఎస్‌కు విజయం కట్టబెడతామన్నారు. నకిరేకల్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామస్తులు సైతం టీఆర్‌ఎస్ గెలుపు కోసం ఏకపక్షంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నకిరేకల్ నుంచి మరోసారి బరిలో దిగుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయమే తమ లక్ష్యమని ప్రకటించారు. అంతకు ముందు శుక్రవారం కట్టంగూర్ మండలంలోని కారింగులగూడెం, సవుళ్లగూడెం గ్రామస్తులు సైతం వీరేశంకు ఏకపక్ష మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కోదాడలో అభ్యర్థిని కూడా ప్రకటించక ముందే తెలంగాణ రాష్ట్ర సమితికి జనం అభిమానం పోటెత్తుతోంది. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారి పై సుమారు 3వేల మోటార్ సైకిళ్లతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పట్టణవాసులు సీఎం కేసీఆర్ మరోసారి గెలవాలని భారీ ప్రదర్శన చేపట్టారు. నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

256
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...