వీరేశంనుగెలిపించుకుంటాం..


Sun,September 16, 2018 02:26 AM

- ఇస్లాంపూర్ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం
నకిరేకల్ : గత 60ఏళ్లలో జరుగని అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు కేవలం నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ అమలు చేసి చూపించారని.. అందుకే తామంతా టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ఇస్లాంపూర్ గ్రామస్తులు ముక్తకంఠతో స్పష్టం చేశారు. నకిరేకల్ మండలంలోని నోముల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇస్లాంపూర్ గ్రామస్తులంతా టీఆర్‌ఎస్ పార్టీకే మద్దతు పలికారు. మా ఓట్లన్నీ నకిరేకల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకేనని శనివారం గ్రామస్తులంతా గులాబీ కండువాలు ధరించి పార్టీ జెండాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన కూడలిలో వీరేశం గెలుపునకు కృషి చేస్తామని మూకుమ్మడిగా తీర్మానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద ముస్లింలమైన తమను సీఎం కేసీఆర్ ఆదరించారన్నారు. ప్రతీ రంజాన్ పండుగకు దుస్తులతో పాటు ఆడపిల్లల వివాహాలకు షాదీ ముబారక్ ద్వారా రూ.లక్ష అందించిన సీఎం కేసీఆర్‌కే మా సంపూర్ణ మద్ద్దతు అని తెలిపారు. వేముల వీరేశం హయాంలో ఇస్లాంపూర్ గ్రామం అన్ని విధాలా అభివృద్ధ్ది చెందిందన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యుడు ముగ్దూం షరీఫ్, అఫ్జల్, ఇమాం సయ్యద్, ఖదీర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గాదగోని కొండయ్య, సర్పంచ్ కుంచం రాములమ్మ సోమయ్య, నాయకులు ఎండీ హజీ, బాదిని సత్తయ్య, చంద్రయ్య, శ్రీధర్ అభినందించారు.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...