ఎకో దంతుడికి జై..


Thu,September 13, 2018 12:47 AM

-విగ్రహాల కొనుగోళ్లతో మార్కెట్లో సందడి
-మట్టి వినాయక విగ్రహాలకు పెరిగిన ఆదరణ
-గతేడాది కంటే అధికంగా ఏర్పాటు
నల్లగొండ కల్చరల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా జిల్లా కేంద్రంలోనూ పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల కొనుగోళ్లతో సందడిగా మారింది. జిల్లా కేంద్రంలోని నెహ్రూగంజ్, ప్రకాశంబజార్, రామగిరి ప్రాంతాల్లో ఫీట్ నుంచి భారీ విగ్రహాల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా వీటీకాలనీలోని వివేకానంద విగ్రహం ప్రాంతంలో, పాల కేంద్రం సమీపంలో రాజస్థాన్‌కు చెందిన కార్మికులు ఆరు నెలలుగా తయారు చేసిన రంగు రంగుల విగ్రహాలు జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

విక్రయ కేంద్రాల వద ్దరద్దీ
జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. హైదరాబాద్ రోడ్డులో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయను ఉచితంగా అందించారు. దీంతో పాటు పలు చోట్ల మట్టి విగ్రహాలను కూడా తయారు చేసి అమ్మకానికి ఉంచడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వినాయకుల విగ్రహాల ధరలు కాస్త పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్సవ కమిటీ వారు విగ్రహాల కొనుగోళ్లతో పాటు పందిళ్ల ఏర్పాటు, డెకరేషన్‌లో అత్యంత ఎక్కువ శ్రద్ధ చూపుతూ విభిన్న రకాల డెకరేషన్ సామగ్రిని కొనుగోలు చేశారు. 9 రోజుల పాటు గణనాథుడికి చేసే ప్రత్యేక పూజల కోసం పూజా సామగ్రిని కూడా కొనుగోలు చేయడంతో కిరాణ దుకాణాల వద్ద సందడి నెలకొంది. గణనాథునికి ప్రత్యేకంగా ఆకులతో నిర్వహించే పూజ కోసం రామగిరి, గడియారం సెంటర్, ప్రకాశంబజార్‌లలో గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతులు 21 రకాల ఆకులను అమ్మకానికి ఉంచారు. వాడవాడలా మండపాల వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు డెకరేషన్ చేస్తున్నారు. ఫీట్ వినాయక విగ్రహం 259 రూపాయల నుంచి మొదలై 15 ఫీట్ల విగ్రహాలు రూ. 48 వేల నుంచి 58 వేలు వరకు విక్రయిస్తున్నారు.

గతేడాది కంటే అధికం
జిల్లాలో గతేడాది కంటే ఈ సారి అధికంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సుమారు ఒక్కో పట్టణంలో 468 నుంచి 650 వరకు విగ్రహాలు నెలకొల్పుతున్నారు. గత ఏడాది 40 వేలకు పైగా విగ్రహాలు నెలకొల్పితే ఈ ఏడాది 50 వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

221
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...