ఆ నియామకాలు చెల్లవు..!


Wed,September 12, 2018 01:15 AM

ఎంజీయూనివర్సిటీ: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 2011-12లో జరిగిన రెగ్యూలర్ బోధన సిబ్బంది పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన నియమాకాలు చేపట్టలేదని అప్పటీ నుంచి పలువురు రాష్ట్ర ప్రభుత్వనికి, గవర్నర్, లోకాయుక్త లాంటి ప్రము ఖ సంస్థలకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటీ ప్రభుత్వంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోడంతో స్వరాష్ట్రంలో ఉన్నతవిద్యకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ప్రభుత్వం వీటిపై దృష్టి సారించిన విషయం విదితమే. తాజాగా ప్రిన్సిపాల్ సెక్రెటరీ తీసుకున్న నిర్ణయంతో అక్రమంగా నియామకమైన వారి గుండెళ్లో గుబులు ప్రారంభమైంది. ఇదే విషయంపై అప్పటి నుంచి నేటివరకు పలు సందర్భాల్లో నమస్తే తెలంగాణ మీనిలో పలు కథనాలు ప్రచురించి వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విథితమే.

నియామకం అక్రమాలు జరిగింది ఇలా...
యూనివర్సిటీలో 2011లో 32 మంది రెగ్యూలర్ బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తులు చేసిన వారికి ఫిబ్రవరి 2012లో ఇం టర్వ్యూలు నిర్వహించారు. అందులో అర్హులైన అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా అనర్హులైన తమ అస్మదీయులకు పెద్దపీట వేశారని ఒక్కరోజులోనే వందలాది మందికి ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించారని అప్పటి నుంచి వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తునేవస్తున్నారు. దీనిపై అన్యాయనికి గురైన అభ్యర్థులు 2012 మార్చి, మే, సెప్టెంబర్‌లో, 2013, 2014, 2015లో సహితం వేర్వేరుగా ఆర్టీఏ కింద నియామకం చేసిన తీరుపై సమాదానాలను వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను అడిగిన సరైన సమాదాలు ఇవ్వలేదు. వాటికి స్పందన లేకపోవడంతో కమిషనర్‌ను ఆశ్రయించడంతో అప్పటీ వీసీ, రిజిస్ట్రార్లకు కమిషన్ నోటీసులు జారీచేసింది. అలా ఎన్నో కమీటీ లు, కమీషన్లు పరిశీలన చేసి చివరికి స్వరాష్ట్రంలో ప్రభు త్వం స్పందించడంతో ఎట్టకేలాకు అక్రమనియమకాలపై తేరపడింది.

స్పందించిన ప్రిన్సిపాల్ సెక్రెటరీ....
ఎంజీయూ పాలకమండలి సమావేశం ఈనెల 10న హైదరాబాబాద్‌లోని సెక్రెటరేట్‌లో వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ రంజీవ్ ఆర్ ఆచార్య హాజరైన్నారు. అయితే ప్రభుత్వం నుంచి వర్సిటీ అధికారులకు ఎంజీయూలో జరిగిన రెగ్యూగలర్ బోధన సిబ్బంది అక్రమానియమకాలపై పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ అంశాన్ని పాలకమండలి సమావేశ ఎజెండాలో ఉంచకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాన్ని ప్రస్తవనలోకి తీసుకవచ్చి తక్షణం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని అక్రమంగా నియమకమైన 32 మందిని తొలగించాలని నోటీసు జారీచేసి దానిపై వీసీతోపాటు పాలకమండలి సభ్యుల సంతకాలు చేయించినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వివరాలను వర్సిటీ ఉన్నత అధికారులు స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తున్న దోరణి కనిపిస్తుంది.

253
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...