తమ్ముడి చేతిలో అన్న హతం


Wed,September 12, 2018 01:14 AM

గరిడేపల్లి : తండ్రి కర్మకాండకు అయిన ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు తన అన్నను హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని సర్వారంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోర్తాల వెంకట్‌రెడ్డి, అంజిరెడ్డి అన్నాదమ్ముళ్లు. 15రోజుల క్రితం వారి తండ్రి రాంరెడ్డి మృతి చెందడంతో ఇద్దరు కలిసి కర్మకాండలు పూర్తి చేశారు. అయితే కర్మకాండకు అయిన ఖర్చులను సోమవారం సాయంత్రం లెక్క చూసుకుంటున్న క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తమ్ముడు అంజిరెడ్డి తన అన్న తలపై రాయితో బలంగా పలుసార్లు మోదాడు. దీంతో తీవ్రగాయాలైన వెంకట్‌రెడ్డి(47) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రజినీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. మృతదేహానికి హుజూర్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా సంఘటనా స్థలాన్ని ఇన్‌చార్జి సీఐ శివశంకర్ పరిశీలించారు. మృతుడు వెంకట్‌రెడ్డికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

235
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...